AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High-Speed Metro: తొలి హైస్పీడ్ మెట్రో వచ్చేసింది

High-Speed Metro: తొలి హైస్పీడ్ మెట్రో వచ్చేసింది

Phani CH
|

Updated on: Feb 23, 2026 | 9:42 PM

Share

ప్రధాని మోదీ ఫిబ్రవరి 22న దేశంలోనే తొలి హైస్పీడ్ మెట్రో రైలు సేవలను ఢిల్లీ-మీరట్ మధ్య ప్రారంభించారు. 'నమో భారత్'గా పిలవబడే ఈ ర్యాపిడ్ రైలు గంటకు 120 కి.మీ వేగంతో ఢిల్లీ-మీరట్ ప్రయాణాన్ని 55 నిమిషాలకు తగ్గిస్తుంది. ఇది భారతదేశపు మొదటి రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS), అత్యాధునిక సౌకర్యాలతో పట్టణ రవాణాలో కొత్త అధ్యాయం సృష్టించింది. ఒకే ట్రాక్‌పై మెట్రో, నమో భారత్ రైళ్లు నడవడం దీని ప్రత్యేకత.

దేశంలోనే తొలి హైస్పీడ్ మెట్రో రైలు సర్వీస్‌ను ప్రధాని మోదీ ఫిబ్రవరి 22న ప్రారంభించారు. ఢిల్లీ-మీరట్ మధ్య 82 కిలోమీటర్ల ర్యాపిడ్ రైల్ కారిడార్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. 120 కి.మీ. వేగంతో నడిచే మీరట్ మెట్రో దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో రైలుగా గుర్తింపు పొందింది. ఈ ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ ఢిల్లీ, మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని 55 నిమిషాలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి మీరట్ మెట్రోతో పాటు నమో భారత్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీలోని సారాయ్ కలే ఖాన్ నుంచి యూపీలోని మోదీపురం వరకు మొత్తం 82.15 కి.మీ. పొడవైన ఢిల్లీ-ఘజియాబాద్- మీరట్ నమో భారత్ కారిడార్ దేశంలోనే తొలి రీజినల్ ర్యాపిడ్ రవాణా వ్యవస్థ. దీనిని గంటకు 135 కి.మీ.. వేగంతో డిజైన్ చేయగా..ప్రస్తుతం గరిష్ఠ వేగం 120 కి.మీగా ఉంది. ఈ కారిడార్‌లో ఆనంద్ విహార్, ఘజియాబాద్, సాహిబాబాద్, మోడీనగర్, మురాద్‌నగర్, శతాబ్ది నగర్, మీరట్ సౌత్, మోడీపురం, బేగంపుల్ వంటి ప్రధాన స్టాప్‌లతో సహా 16 స్టేషన్లు ఉన్నాయి. ఈ మెట్రోలో 2×2 సీటింగ్, ఓవర్ హెడ్ లగేజ్ ర్యాక్​లు, మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సాకెట్లు, CCTV నిఘా, అగ్ని ప్రమాద గుర్తింపు వ్యవస్థలు ఇందులో ఉంటాయి. మహిళల కోసం ప్రత్యేక కోచ్​ ఏర్పాటు చేశారు. మరో విశేషమేమిటంటే, ఒకే రైల్వే ట్రాక్‌పై నమో భారత్, లోకల్ మెట్రో నడవడం దేశంలో ఇదే తొలిసారి. ఒకే టిక్కెట్‌పై నమో భారత్, మీరట్ మెట్రోలో ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. మీరట్ మెట్రో రైళ్లు మూడు కోచ్ సెట్లు, ఒక్కోసారి 700 కంటే ఎక్కువ మంది ప్రయాణించే వీలుంటుంది.ఈ కొత్త విధానం పట్టణ రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అన్ని స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ స్క్రీన్ డోర్స్ ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో మహిళలు, సీనియర్ సిటిజన్లకు రిజర్వు చేసిన సీటింగ్ ఉంటుంది. వీల్‌చైర్లు, మెడికల్ స్ట్రెచర్‌లకు స్థలం, విశాలమైన లిఫ్ట్‌లు ప్రతి స్టేషన్‌లోనూ ఉన్నాయి. పూర్తిగా ఈ కారిడార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ- మీరట్ మధ్య ప్రయాణానికి 55 నిమిషాలు పడుతుందని అంచనా. యూపీలోని మీరట్, ఘజియాబాద్, నోయిడా, ఢిల్లీ, గురుగ్రామ్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం, రోడ్లపై రద్దీని తగ్గించడం ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లక్ష్యం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొడుక్కి రూ. 4 కోట్ల కారు గిఫ్ట్‌ ఇచ్చిన హార్డిక్

తల్లి పెంపకమైతే.. తండ్రి ఇంటిపేరు అక్కర్లేదు

బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్‌ !! ఇనప్పెట్టె విప్పితే నోట్ల కట్టలు..

ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్‌ అభయారణ్యంలో అడవి దున్న

ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??

Follow Us