AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో పెరగనున్న ధరలు!

సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో పెరగనున్న ధరలు!

Phani CH
|

Updated on: Aug 11, 2026 | 11:27 AM

Share

ముడిసరుకుల ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మరోసారి ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో సబ్బులు, బిస్కెట్లు సహా నిత్యావసరాల ధరలు పెరగొచ్చు. కొన్ని సంస్థలు ష్రింక్‌ఫ్లేషన్ ద్వారా ప్యాకెట్ ధర మార్చకుండా పరిమాణాన్ని తగ్గించనున్నాయి. ఇప్పటికే జూన్ త్రైమాసికంలో ధరలు పెంచినప్పటికీ వ్యయభారం తగ్గలేదు. ఇదే సమయంలో సాధారణ మద్యం అమ్మకాలు తగ్గగా, ప్రీమియం బ్రాండ్లకు వినియోగదారుల ఆదరణ పెరుగుతోంది.

భారతీయ సామాన్యుల జేబులకు మరోసారి చిల్లు పడనుంది. నిత్యం ఉపయోగించే సబ్బులు, బిస్కెట్లు, ఇతర ఎఫ్‌ఎంసీజీ (FMCG) ఉత్పత్తుల ధరలను పెంచేందుకు ప్రముఖ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇరాన్ యుద్దం వంటి అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ముడిసరుకుల వ్యయం విపరీతంగా పెరిగింది. దాంతో తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో ధరల బాదుడుకు సంస్థలు సిద్ధమవుతున్నాయి. జూన్ త్రైమాసికంలోనే కంపెనీలు 2 నుండి 5 శాతం వరకు ధరలను పెంచినప్పటికీ, ముడిసరుకుల భారం ఇంకా తగ్గలేదు. దీంతో మరోసారి ధరలను సమీక్షించక తప్పడం లేదని చెబుతున్నాయి. మరికొన్ని కంపెనీలు ‘ష్రింక్‌ఫ్లేషన్’ వ్యూహాన్ని అమలు చేయనున్నాయి. అంటే ప్యాకెట్ ధరను మార్చకుండా, లోపల ఉండే సరుకు పరిమాణాన్ని తగ్గిస్తాయి. ప్రముఖ సంస్థ పంచదార, పామాయిల్ ధరల పెరుగుదల వల్ల రూ.5, రూ.10 బిస్కెట్ ప్యాకెట్ల సైజు తగ్గించే ఆలోచనలో ఉంది. మరికొన్ని దిగ్గజ కంపెనీలు కూడా ఉత్పత్తుల ధరలను పెంచే సూచనలు ఇచ్చాయి. ఒకవైపు నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే, మరోవైపు ప్రజలు ప్రీమియం మద్యంపై భారీగా ఖర్చు చేయడం విశేషం. పలు కంపెనీలు జూన్ త్రైమాసికంలో ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలలో రెండంకెల వృద్ధిని సాధించాయి. సాధారణ మద్యం అమ్మకాలు తగ్గి, ఖరీదైన ప్రీమియం మద్యం వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్‌ చేసిన డ్రైవర్‌, కండక్టర్‌.. ఆ తర్వాత

అల్లు అర్జున్ X షారూఖ్ ఖాన్? కానీ ఊహించని ట్విస్ట్ ఉంది!

ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

రేషన్‌ షాపులో బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. పరిశీలించి షాక్‌ తిన్న యజమాని

Follow Us