కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘బ్రాండ్ న్యూ డే’
‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. తొలి వారంలోనే 1.3 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు 2 బిలియన్ క్లబ్‌పై కన్నేసింది. ఇప్పటివరకు ఏడు సినిమాలు మాత్రమే ఈ మార్క్‌ను దాటాయి. ‘నో వే హోమ్’ 1.9 బిలియన్ డాలర్ల వద్ద ఆగిపోగా, బ్రాండ్ న్యూ డే ఆ రికార్డును అధిగమిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.
స్పైడర్ మ్యాన్ ఫీవర్ ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందిప్పుడు. ఈ సినిమా సరికొత్త కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే ఏకంగా 1.3 బిలియన్ డాలర్లు వసూలు చేసింది బ్రాండ్ న్యూ డే.. అయితే అందరి మనసులో ఉన్న డౌట్ ఒక్కటే.. ఈ సినిమా 2 బిలియన్ల క్లబ్‌లో చేరుతుందా అని..? అసలు ప్రపంచంలో 2 బిలియన్ డాలర్లు దాటిన సినిమాలెన్నో తెలుసా..? వరల్డ్ సినిమా అంతా స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే వసూళ్ల గురించే మాట్లాడుకుంటుందిప్పుడు. ఈ సినిమా దూకుడు చూస్తుంటే 2 బిలియన్ క్లబ్‌లో చేరేలా ఉంది. ఇప్పటి వరకు వరల్డ్ సినిమా హిస్టరీలో కేవలం 7 మూవీస్ మాత్రమే 2 బిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసాయి. అందులో 2.9 బిలియన్లతో అవతార్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. అవెంజర్స్: ఎండ్ గేమ్ 2.79 బిలియన్లతో రెండో స్థానంలో నిలిచింది. అవతార్ వే ఆఫ్ వాటర్ 2.33 బిలియన్, టైటానిక్ 2.25 బిలియన్, నాజా 2 సినిమాకు 2.2 బిలియన్ డాలర్లు వచ్చాయి. అలాగే స్టార్ వార్స్: ది ఫోర్స్ అవెకెన్స్ సినిమాకి 2.06 బిలియన్ రాగా.. అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ సినిమాకు 2.04 బిలియన్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక స్పైడర్ మ్యాన్ గత పార్ట్ నో వే హోమ్ ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్లు వసూలు చేసి.. తృటిలో 2 బిలియన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మిస్సైన రికార్డును బ్రాండ్ న్యూ డే సినిమా కొట్టేలా ఉంది. ఫస్ట్ వీక్ ఈ సినిమాకు 1.3 బిలియన్ డాలర్లు వచ్చాయి.. ఇంకా థియేటర్లలో స్ట్రాంగ్‌గానే ఉన్నాడు స్పైడీ. ఇదే స్పీడ్ మరో వారం పాటు కొనసాగితే ఈ చిత్రం 2 బిలియన్ల మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేయడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీమిండియాను కలవరపెడుతున్న వరుస గాయాలు.. రంగంలోకి బీసీసీఐ పెద్దలు!
వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు
సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో పెరగనున్న ధరలు!
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

