AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియాను కలవరపెడుతున్న వరుస గాయాలు.. రంగంలోకి బీసీసీఐ పెద్దలు!

టీమిండియాను కలవరపెడుతున్న వరుస గాయాలు.. రంగంలోకి బీసీసీఐ పెద్దలు!

Phani CH
|

Updated on: Aug 11, 2026 | 11:33 AM

Share

టీమిండియాను వరుస గాయాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పలువురు కీలక ఆటగాళ్లు రిహాబిలిటేషన్ పొందుతున్నారు. బుమ్రా, హార్దిక్ పాండ్యా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి తదితరుల గాయాలపై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కార్యదర్శి దేవజీత్ సైకియా, వీవీఎస్ లక్ష్మణ్‌తో సమావేశమయ్యారు. ఫిట్‌నెస్, రిహాబిలిటేషన్ ప్రక్రియలను సమీక్షించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ భావిస్తోంది.

టీమిండియాను వరుస గాయాల సమస్య కలవరపెడుతోంది. కీలక ఆటగాళ్లందరూ ఒక్కొక్కరిగా గాయాల బారిన పడుతుండటంతో భారత జట్టు ప్రాక్టీస్ క్యాంప్‌ హాస్పిటల్ వార్డులా మారిపోయింది. ఏకంగా ఒక బలమైన జట్టునే నిర్మించేంత మంది ఆటగాళ్లు గాయపడటంతో బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు చేరుకుని, సిఓఈ హెడ్ వివిఎస్ లక్ష్మణ్‌తో అత్యవసరంగా భేటీ కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని రిహాబ్ సెంటర్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బుమ్రా మోకాలి వాపు సమస్యతో ఇబ్బంది పడుతుంటే, సాయి సుదర్శన్ బొటనవేలి నొప్పితో బాధపడుతున్నారు. ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి వంటి కీలక ఆటగాళ్లు వివిధ రకాల గాయాల బారిన పడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆటగాళ్లను పూర్తి ఫిట్‌నెస్ సాధించకముందే మైదానంలోకి దించడంపై సెలెక్షన్ కమిటీకి, స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడమే ఈ అత్యవసర సమావేశానికి దారితీసింది. స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి శాశ్వత హెడ్ లేకపోవడం, ఆటగాళ్లు సరైన ఫిట్‌నెస్ ప్రమాణాలు పాటించకపోవడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. హర్షిత్ రాణా ఓవర్ వెయిట్‌తో కనిపించడం, నితీష్ రెడ్డి బౌలింగ్ వేగం పెంచే క్రమంలో గాయపడటం చర్చనీయాంశమైంది. మరోవైపు బుమ్రా, సాయి సుదర్శన్‌ల లభ్యతపై వైద్య బృందం, సెలెక్టర్ల మధ్య అస్పష్టత నెలకొనడంతో ఇకపై తొందరపడి ఆటగాళ్లను మైదానంలోకి దించకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు

గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు

సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో పెరగనున్న ధరలు!

అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్‌ చేసిన డ్రైవర్‌, కండక్టర్‌.. ఆ తర్వాత

Follow Us