అనకాపల్లి జిల్లా కె.కోటపాడులో యువతీ యువకులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని విశాఖపట్నం పెందుర్తికి చెందిన మైనర్ ఇంటర్ విద్యార్థులు సత్యసాగర్, అరుణగా పోలీసులు గుర్తించారు. ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలం వద్ద సూసైడ్ నోట్ లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.