AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..

ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..

Phani CH
|

Updated on: Sep 18, 2026 | 10:21 PM

Share

గణేశ్‌ చతుర్థి వేడుకల్లో భాగంగా పుణెలో ఏర్పాటు చేసిన వినూత్న ‘పానీపూరీ గణపతి’ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎఫ్‌సీ రోడ్డులోని గణేశ్‌ భేల్‌ నిర్వాహకులు ఏకంగా 21,000 పానీపూరీలతో 13 అడుగుల భారీ గణనాథుడి విగ్రహాన్ని రూపొందించారు. కళాకారులు రూపేశ్‌, దినేశ్‌ గుడ్మెవార్‌ సుమారు రెండు నెలలు శ్రమించి దీనిని తీర్చిదిద్దారు. విగ్రహం పాడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

గణేశ్ చతుర్ధి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా ఈ నవరాత్రుల్లో భక్తులు తమ భక్తికి సృజనాత్మకతను జోడించి వినూత్న రీతిలో భారీ గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిలో పుణెలో కొలువుదీరిన ‘పానీపూరీ గణపతి’ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. పుణెలోని ఎఫ్‌సీ రోడ్డులో ఉన్న ‘గణేశ్ భేల్’ నిర్వాహకులు ఈ అద్భుతానికి తెరలేపారు. ఏకంగా 21,000 పానీపూరీలను ఉపయోగించి 13 అడుగుల ఎత్తైన భారీ గణపతి విగ్రహాన్ని రూపొందించారు. రూపేశ్, దినేశ్ గుడ్మెవార్ అనే కళాకారులు దాదాపు రెండు నెలల పాటు శ్రమించి అద్భుతంగా తీర్చిదిద్దారు. విగ్రహం పాడవకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పానీపూరీ గణపతి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూపీఐ ఛార్జీల వెనుక అమెరికా హస్తం ఉందా? అసలు నిజమేంటి?

జలపాతం వద్ద షాకింగ్ సీన్..

గడువు దాటితే.. లైసెన్స్‌ రద్దే!

ఒక్క కాగితం.. స్మృతి మంధాన జీవితాన్నే మార్చేసింది

ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే

Follow Us