ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ముంబై ఘాట్‌కోపర్ వీధుల్లో భిక్షగాడి వేషంలో కనిపించడం వైరల్‌గా మారింది. 2024 ఎన్నికల అఫిడవిట్‌లో రూ.3,383 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించిన ఆయన, జైన ఆధ్యాత్మిక గురువు నమ్రముని సూచనతో కొన్ని గంటలు వేషం మార్చుకుని భిక్షాటన చేశారు. ప్రజలు తనతో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేసినట్లు షా తెలిపారు. అనంతరం అదే ప్రాంతాలకు తన అసలు రూపంలో వెళ్లి ప్రజల స్పందనను గమనించారు.
‘బిచ్చగాడు’ సినిమా చూసి థ్రిల్ అయ్యాం.. తల్లికోసం కోట్లున్న ఆ హీరో రోడ్డెక్కి భిక్షం ఎత్తుకోవడం సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్. మరి అచ్చం అదే సినిమా రియల్ లైఫ్‌లో జరిగితే? — జేబులో వేల కోట్లు, చుట్టూ సెక్యూరిటీ, కాళ్లకింద ఏసీ కార్ల విలాసాలు ఇవేవీ పట్టించుకోకుండా.. ఓ ప్రజాప్రతినిధి నిజంగానే రోడ్డెక్కితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే సీన్ ముంబై వీధుల్లో రిపీట్ అయింది! కోటీశ్వరుడైన ఆ లీడర్ చేసిన పనికి దేశమంతా ఇప్పుడు షాక్ అవుతోంది. మహారాష్ట్రలోని ఘాట్‌కోపర్ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన నియోజకవర్గంలో పేరున్న లీడర్ మాత్రమే కాదు, వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్న అత్యంత ధనికుడు. అయితే, ఆధ్యాత్మిక గురువు నమ్రముని మహారాజ్ సూచన మేరకు.. జైన మత పవిత్ర చాతుర్మాస సమయంలో ఆయన ఒక వినూత్న సాహసానికి సిద్ధపడ్డారు. అసలు సమాజం అంటే ఏమిటి? పేదవాడి కష్టం ఎలా ఉంటుంది? డబ్బు, హోదా లేకపోతే ఈ ప్రపంచం మనిషిని ఎలా చూస్తుంది? అని స్వయంగా అనుభవించి తెలుసుకోవాలనుకున్నారు. ఇంకేముంది.. తనకున్న ఖరీదైన కార్లు, పవర్, హోదా అన్నింటినీ క్షణంలో పక్కన పెట్టేశారు. ఎవరికీ గుర్తుపట్టకుండా మేకప్ సాయంతో తన రూపురేఖలను పూర్తిగా మార్చేసుకున్నారు. ఒంటిపై మురికి బట్టలు వేసుకుని, సాధారణ భిక్షగాడిలా ముంబై ఘాట్‌కోపర్ వీధుల్లోకి అడుగుపెట్టారు. ఒక్కపూట భోజనం కోసం ఒక సాధారణ భిక్షగాడు పడే వేదనను ఆయన ప్రత్యక్షంగా అనుభవించారు. ఆ వేషంలో ఉన్నప్పుడు రోడ్డు మీద జనాలు ఆయనతో ఎలా ప్రవర్తించారు? ఒక చిన్న సమోసా బండి నడిపే పేద వ్యాపారి ఎలాంటి స్వార్థం లేకుండా తనకిచ్చిన సాయం చూసి ఆ ఎమ్మెల్యే మనసు చలించిపోయింది! కొన్ని గంటల పాటు భిక్షాటన ముగిసిన తర్వాత పరాగ్ షా తన మేకప్ తీసేసి, ఒరిజినల్ గెటప్‌లోకి వచ్చేశారు. సరిగ్గా కొద్దిసేపటి క్రితం తాను భిక్షగాడిగా అడిగిన అదే ప్రదేశానికి, అదే వ్యక్తుల దగ్గరికి ఎమ్మెల్యే హోదాలో మళ్లీ వెళ్లారు. అక్కడ అసలు మ్యాజిక్ జరిగింది! కొద్దిసేపటి క్రితం భిక్షం వేసిన అదే జనం.. ఇప్పుడు ఎమ్మెల్యేని చూసి ఎలా నమస్కరించారు? ఎలా మాట్లాడారు? మనిషికి డబ్బు, హోదా లేనప్పుడు సమాజం ఎలా చూస్తుంది? ఉన్నప్పుడు ఎలా గౌరవిస్తుంది? అనే వాస్తవాలను ఆయన అనుభవం ద్వారా తెలుసుకున్నారు. రియల్ లైఫ్ ‘బిచ్చగాడు’ ప్రయోగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!

