AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క  కాగితం.. స్మృతి మంధాన జీవితాన్నే మార్చేసింది

ఒక్క కాగితం.. స్మృతి మంధాన జీవితాన్నే మార్చేసింది

Phani CH
|

Updated on: Sep 18, 2026 | 10:00 PM

Share

స్మృతి మంధాన తన విజయ రహస్యాల్లో ఒకటైన మేనిఫెస్టేషన్‌ రొటీన్‌ గురించి పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఐసీసీ నంబర్‌ వన్‌ బ్యాటర్‌, వరల్డ్‌ కప్‌ విన్నర్‌ అవుతానని కాగితంపై రాసి దిండు కింద పెట్టుకునేవారట. తల్లిదండ్రుల కోసం సొంత ఇల్లు కొనాలనే కలను బ్లాంక్‌ చెక్‌పై రాసి ప్రతిరోజూ చూసేవారు. విజువలైజేషన్‌, గోల్‌ స్క్రిప్టింగ్‌ తనకు లక్ష్యాలపై దృష్టి పెట్టేందుకు ఉపయోగపడ్డాయని ఆమె తెలిపారు.

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. 2025 మహిళా వన్డే ప్రపంచ కప్, ఆసియా కప్ విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ స్థాయికి చేరుకోవడం వెనక తన కోచ్ నేర్పించిన ఒక ప్రత్యేకమైన ‘మేనిఫెస్టేషన్ రొటీన్’ ఎంతో సహాయపడిందని ఆమె ఇటీవలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. తాను ఐసీసీ నంబర్ వన్ బ్యాటర్, వరల్డ్ కప్ విన్నర్ అని కాగితంపై రాయించి, వాటిని దిండు కింద పెట్టుకుని పడుకోమనేవారట. మొదట్లో ఇవి సిల్లీగా అనిపించినా, ఆ తర్వాత అవే నిజం కావడంతో తనకు దీనిపై పూర్తి నమ్మకం కుదిరిందని ఆమె వెల్లడించారు. తన కలలను నిజం చేసుకునే క్రమంలో ఆమె మరో ఆసక్తికరమైన పద్ధతి పాటించారు. తాము అద్దె ఇంట్లో ఉన్నప్పుడు అమ్మానాన్నల కోసం సొంత ఇల్లు కొనాలని సంకల్పించారు. ఒక బ్లాంక్ చెక్‌పై తాను కోరుకున్న ఇల్లు గురించి రాసి, ప్రతిరోజూ చూసే గోడపై అతికించుకున్నారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆ కలను నిజం చేసుకుని తల్లిదండ్రులకు ఇల్లు బహుమతిగా ఇచ్చారు. కేవలం ఆలోచించడమే కాకుండా వాటిని నిత్యం విజువలైజ్ చేసుకోవడం వల్లే విజయం సాధ్యమైందని ఆమె తెలిపారు. ఈ టెక్నిక్ గురించి ప్రముఖ సైకాలజిస్ట్ ఏం చెప్పారో తెలుసా? విజువలైజేషన్ అనేది ఒక పవర్ఫుల్ సైకో టెక్నాలజీ అని చెప్పారు. లక్ష్యాన్ని వాస్తవంలో సాధించడానికి ముందే మనసులో ఊహించుకోవడం వల్ల మెదడులో ప్రత్యేక నాడీ మార్గాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి భయం, ఆందోళన దూరమవుతాయి. అనుకున్న లక్ష్యాలను కాగితంపై రాయడాన్ని ‘స్క్రిప్టింగ్’ అంటారు. ఇది మన మెదడులోని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ – RASను ఉత్తేజితం చేసి సరైన అవకాశాలను ఆకర్షిస్తుంది. రోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు కొద్ది నిమిషాలు గోల్ స్క్రిప్టింగ్ కోసం కేటాయించడం ద్వారా ఎవరైనా తమ జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే

కృత్రిమ సూర్యుడి దిశగా భారత్ కీలక ముందడుగు..

Follow Us