టికెట్ హైక్స్ ఎఫెక్ట్.. నిర్మాతలకు డేంజర్ సిగ్నల్..
తెలుగు సినిమాలకు థియేటర్లలో ఆడియన్స్ మళ్లీ పెరుగుతున్న సమయంలో టికెట్ రేట్ల పెంపుపై చర్చ మొదలైంది. ఇటీవల ‘పెద్ది’ మినహా చాలా సినిమాలకు హైక్స్ లేకపోవడం కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిందనే అభిప్రాయం ఉంది. ‘ఇరుముడి’ వంటి సినిమాలు అందుబాటు ధరలతో మంచి స్పందన పొందగా, భారీ టికెట్ రేట్లతో వచ్చిన ‘టాక్సిక్’ ఆశించిన స్థాయిలో నిలవలేదని కథనం పేర్కొంటోంది. దీంతో టికెట్ ధరలు, కంటెంట్ మధ్య సంబంధంపై చర్చ సాగుతోంది.
ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది.. థియేటర్లకు ఆడియన్స్ బాగానే వస్తున్నారు. కాస్త యావరేజ్ టాక్ వచ్చినా కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు సినిమాలను.. ఇలాంటి టైమ్‌లో మళ్లీ టికెట్ హైక్స్ చర్చ మొదలైంది. మరి రేట్లు పెంచితే ఆడియన్స్ మైండ్ సెట్ అలాగే ఉంటుందా.. థియేటర్స్ కళ పెరుగుతుందా తగ్గుతుందా..? అసలు ఏ సినిమా కోసం హైక్స్ అడుగుతున్నారు..? ఏ దేవుడు కరుణించాడో కానీ గత రెండు నెలలుగా థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి. కనీసం వారానికో సినిమా బయ్యర్లకు కాసుల పంట పండిస్తుంది. పెద్ది మొదలుపెట్టిన ఈ విజయాలను లెనిన్, మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు కంటిన్యూ చేసాయి. తాజాగా ఇరుముడి రవితేజ కెరీర్‌లోనే కాదు ఇండస్ట్రీలోనే పెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ ఇంత బాగా పర్ఫార్మ్ చేయడానికి కంటెంట్ ఓ కారణమైతే.. అందుబాటులో ఉన్న టికెట్ రేట్లు మరో ప్రధాన కారణం. పెద్ది మినహాయిస్తే ఏ సినిమాకు నిర్మాతలు హైక్స్ అడగలేదు. ఈ ఒక్క రీజన్‌తోనే ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్, డిసి లాంటి డబ్బింగ్ సినిమాలకు కాసుల పంట పండటానికి కారణమిదే. మొన్నటికి మొన్న ఇరుముడి సినిమా కలెక్షన్స్ మీద రేట్ల ప్రభావం బానే ఉంది.. సినిమాపై ఉన్న హైప్‌కు తోడు తక్కువ రేట్లు ఉండటంతో థియేటర్లకు పోటెత్తారు ఆడియన్స్. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది.. కానీ ఆ మధ్య ఓసారి టాక్సిక్ కోసం రేట్లు పెంచారు మేకర్స్.. 500 కోట్లతో వచ్చిన ఆ సినిమా కనీసం ఒక్కరోజు కూడా థియేటర్లలో ఆడకుండానే వెళ్లిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ …అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డ్
ర్యాపిడో, ఓలా , ఊబర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!
దేశవ్యాప్తంగా పనీర్ బ్యాన్! 5 వేల లైసెన్సులు రద్దు!
UPI కొత్త నిబంధనలు.. సామాన్యులపై ప్రభావం ఎంత?
Nirmala Seetharaman: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే

