AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుక్కి రూ. 4 కోట్ల కారు గిఫ్ట్‌ ఇచ్చిన హార్డిక్

కొడుక్కి రూ. 4 కోట్ల కారు గిఫ్ట్‌ ఇచ్చిన హార్డిక్

Phani CH
|

Updated on: Feb 23, 2026 | 9:38 PM

Share

విడాకులు తీసుకున్నప్పటికీ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన కొడుకు అగస్త్య పాండ్య, మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌లకు సుమారు రూ. 4 కోట్ల విలువైన లగ్జరీ ల్యాండ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు. కొడుకు భవిష్యత్ విషయంలో హార్దిక్, నటాషా ఆదర్శవంతమైన కో-పేరెంట్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఖరీదైన గిఫ్ట్ అగస్త్య పట్ల హార్దిక్‌కు ఉన్న అపారమైన ప్రేమను చాటుతుంది. ఈ చర్యపై అభిమానులు హార్దిక్‌ను ప్రశంసిస్తున్నారు.

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి తన కొడుకుపై ప్రేమను చాటుకున్నాడు. మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్, కుమారుడు అగస్త్య పాండ్య కోసం సుమారు రూ. 4 కోట్ల విలువైన లగ్జరీ లాండ్‌ రోవర్‌ కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోల్లో నటాషా, అగస్త్యతో కలిసి బ్లాక్ కార్ పక్కన కనిపించింది. ఇది లాండ్ రోవర్ తయారు చేసిన డిఫెండర్ మోడల్‌గా తెలుస్తోంది. వేరియంట్, కస్టమైజేషన్ ఆధారంగా దీని ధర రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ఫోటోలను కార్ డీలర్‌షిప్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం మరింత వైరల్ అయింది. హార్దిక్, నటాషా 2024లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ, కుమారుడు అగస్త్య విషయంలో ఇద్దరూ ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. చదువు, ఆరోగ్యం, భవిష్యత్ వంటి అంశాల్లో ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఆదర్శ కో-పేరెంట్స్‌గా నిలుస్తున్నారు. హార్దిక్ తిరిక లేని షెడ్యూల్‌లో ఉన్నా, కొడుకుతో సమయం గడపటానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈ ఖరీదైన కార్ గిఫ్ట్ కూడా కొడుకుపై హార్ధిక్‌కు ఉన్న ప్రేమకు నిదర్శనంగా అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల హార్దిక్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. మోడల్ మహీకా శర్మతో హార్దిక్ రిలేషన్‌లో ఉన్నాడు. అయితే, ఎన్ని మార్పులు వచ్చినా అగస్త్యనే తన జీవితంలో మొదటి ప్రాధాన్యత అని హార్దిక్ స్పష్టం చేస్తున్నాడు. మరోవైపు నటాషా కూడా ఫిట్‌నెస్, కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో “జీవితం నేర్పిన పాఠాలు నన్ను మరింత బలంగా మార్చాయి” అని ఆమె చెప్పింది. ఈ లగ్జరీ కార్ గిఫ్ట్ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో హార్దిక్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన తండ్రి అంటే ఇలాగే ఉండాలి, డివోర్స్ అయినా బాధ్యత మరిచిపోలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రొఫెషనల్ కెరీర్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్య ప్రస్తుతం టీమిండియా తరఫున టీ20 వరల్డ్ కప్‌ ఆడుతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే వికెట్ తీసిన హార్దిక్ భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. సూపర్-8 దశలో భారత్ విజయాలు సాధించడంలో ఈ ఆల్‌రౌండర్ పాత్ర మరింత కీలకం కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల్లి పెంపకమైతే.. తండ్రి ఇంటిపేరు అక్కర్లేదు

బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్‌ !! ఇనప్పెట్టె విప్పితే నోట్ల కట్టలు..

ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్‌ అభయారణ్యంలో అడవి దున్న

ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??

అసలు ఆమె త‌ల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల‌ కొడుక్కి వింత‌ శిక్ష‌

Follow Us