తల్లి పెంపకమైతే.. తండ్రి ఇంటిపేరు అక్కర్లేదు
బాంబే హైకోర్టు కీలక తీర్పుతో ఒంటరి తల్లులకు పెద్ద ఊరట లభించింది. తండ్రి సంరక్షణ లేకుండా తల్లి వద్ద పెరిగిన బిడ్డలకు తల్లి ఇంటిపేరు, కులం పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. పితృస్వామ్య భావజాలాన్ని పక్కన పెడుతూ, బాలిక పాఠశాల రికార్డుల నుండి తండ్రి వివరాలు తొలగించి తల్లి వివరాలు నమోదు చేయాలని ఆదేశించింది. ఇది స్త్రీ సాధికారతకు, మాతృత్వపు హక్కులకు మద్దతుగా నిలిచే చారిత్రక తీర్పు.
పిల్లలకు తండ్రి ఇంటి పేరు, కులం లేకపోతే బిడ్డకు చట్టబద్ధమైన గుర్తింపు ఉండదనే పితృస్వామ్య భావజాలాన్ని పక్కన పెడుతూ బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేవలం తల్లి సంరక్షణలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటి పేరు లేదా ఆయన కులంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అలాంటి చిన్నారులకు తల్లి ఇంటిపేరుతో పాటు ఆమె కులాన్నే పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. కేసు డీటైల్స్‌లోకి వెళ్తే.. 12 ఏళ్ల బాలిక తన స్కూల్ రికార్డుల్లో తన గుర్తింపునకు సంబంధించి మార్పులు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ బాలిక పుట్టినప్పటి నుంచి కేవలం తన తల్లి పెంపకంలోనే పెరుగుతోంది. పాఠశాల రికార్డుల్లో ఉన్న తన తండ్రి ఇంటి పేరును, అలాగే ఆయన కులం పేరును పూర్తిగా తొలగించాలని ఆమె అడిగింది. వాటి స్థానంలో తనను సాకుతున్న తల్లి ఇంటి పేరును, తల్లి కులాన్ని నమోదు చేయాలని కోరింది. ఈ పిటిషన్‌ను విచారించిన బెంచ్ బాలిక విన్నపాన్ని సమర్థించింది. ఒక తల్లి సింగిల్ పేరెంట్‌గా ఉంటూ బిడ్డను పోషిస్తున్నప్పుడు.. ఆమెకు ఉన్న ఇంటి పేరు, కులమే ఆ బిడ్డకు కూడా చట్టబద్ధంగా వర్తిస్తాయని తేల్చిచెప్పింది. పాఠశాల రికార్డుల నుంచి తండ్రి పేరు, కులం వివరాలను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. వాటి స్థానంలో తల్లి వివరాలను నమోదు చేయాలని అధికారులకు స్పష్టంగా చెప్పింది. ఒంటరి తల్లులు ఎదుర్కొంటున్న గుర్తింపు సమస్యలకు ఈ తీర్పు శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. బిడ్డ సంరక్షణలో ఎలాంటి పాత్ర పోషించని తండ్రి పేరును మోయాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పడం ద్వారా స్త్రీ సాధికారతకు, మాతృత్వపు హక్కులకు పెద్దపీట పడిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె విప్పితే నోట్ల కట్టలు..
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె తీస్తే నోట్ల కట్టలు
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

