నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
జపాన్లోని ఒసాకా నగరం లీకవుతున్న నీటి పైపుల సమస్యతో సతమతమవుతోంది. నిధుల కొరతతో పునరుద్ధరణ పనులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఓ అజ్ఞాత దాత 21 కేజీల బంగారాన్ని (రూ.32 కోట్లకు పైగా) విరాళంగా ఇచ్చారు. ఈ నిధులతో పాతబడిన తాగునీటి, డ్రైనేజీ పైపుల వ్యవస్థను సమూలంగా పునరుద్ధరించాలని మేయర్ యోకోయామా సంకల్పించారు. ఇది నగర అభివృద్ధికి, ప్రజల భద్రతకు దోహదపడుతుంది.
జపాన్ లోని నగరంలో 90 శాతానికి పైగా నీటి పైపులు లీకేజీలమయమే. దీనిపై నగర వాటర్‌వర్క్స్ ఇప్పటికే ఆందోళన తెలిపింది. వాటి పునరుద్ధరణకు భారీ నిధులు కావాలి. కానీ నగరానికి అంత బడ్జెట్ లేదు. ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. జపాన్‌లోని ఒసాకా నగరంలోని అజ్ఞాత దాత ఒకరు గత నవంబర్‌లో ఏకంగా 21 కేజీల బంగారు కడ్డీలు విరాళమిచ్చారు. పైపుల పునరుద్ధరణ సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వాటిని సద్వినియోగం చేస్తామన్నారు నగర మేయర్. సదరు అజ్ఞాత దాత గతంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ కోసం లక్షల రూపాయల క్యాష్ ఇచ్చారని తెలిపారు. ఆ అజ్ఞాత వ్యక్తి తను నివాసముంటున్న ఒసాకా నగరం మీద ప్రేమతో ఏకంగా 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చేశారు! వాటి విలువ ఏకంగా రూ.32 కోట్ల పై మాటే! నగరంలో పూర్తిగా పాతబడిపోయిన తాగునీటి, డ్రైనేజీ పైపుల వ్యవస్థను వాటి సాయంతో సమూలంగా పునరుద్ధరించాల్సిందిగా అతను కోరారు. ఒసాకా మేయర్ యొకోయామా గురువారం ఈ విషయాన్ని తెలిపారు. 30 లక్షల జనాభా ఉన్న ఒకాసా.. జపాన్‌లో మూడో అతి పెద్ద నగరం. ఒకప్పుడు దేశ రాజధానిగా ఉండేది ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని. అత్యంత పురాతన నగరం కూడా. ఇక్కడి మంచి నీరు, డ్రైనేజీ పైపులు అంతే పురాతనమైనవి. పైపులు పూర్తిగా తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయి. వాటి లీకేజీలు స్థానికుల భద్రతను నిత్యం ప్రమాదంలోకి నెడుతున్నాయి. వీటికి తోడు నగరంలో రోడ్లపై సింక్ హోల్స్ భారీ గుంతలు కూడా సర్వసాధారణంగా మారాయి. గతేడాది అలాంటి ఓ భారీ సింక్ హోల్ ఏకంగా ఒక క్యాబ్‌నే మింగేసింది. ఆ దుర్ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. నిధుల లేమి కారణంగా మంచినీటి, డ్రైనేజీ పైపుల మార్పిడి వ్యవహారం ఓ పట్టాన ముందుకు సాగడం లేదు. ప్రస్తుత దానంతో ఆ పనులు పూర్తి చేయాలని నగర మేయర్ సంకల్పించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: మళ్లీ దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు!
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక
వామ్మో.. రెండు తలల పాము.. బెంబేలెత్తిన జనం
Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్ లెవలే వేరేగా ఉండు
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక
వామ్మో.. రెండు తలల పాము.. బెంబేలెత్తిన జనం
అనుమానపు భర్తపై భార్య కన్నెర్ర.. చివరికి ఇలా..
టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్!
వణికిస్తున్న వన్యప్రాణులు..కామారెడ్డిలో చిరుత .. భద్రాద్రిలో పులి

