AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మళ్లీ దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు!

Gold Price Today: మళ్లీ దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు!

Phani CH
|

Updated on: Feb 23, 2026 | 6:50 PM

Share

అమెరికాలో ట్రంప్ విధించిన సుంకాలు చట్టబద్ధం కావని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా, ట్రంప్ 10% కొత్త సుంకాలు విధించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగి, పెట్టుబడిదారులు డాలర్ నుండి బంగారం వైపు మళ్లారు. ఫలితంగా డాలర్ పతనమై, బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 23న బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరగా, నిపుణులు 10 గ్రాములు రూ.2 లక్షలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

అమెరికాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అగ్రరాజ్యపు అత్యున్నత న్యాయస్థానం ట్రంప్ విధించిన సుంకాలు చట్టబద్దం కావని తేల్చి చెప్పింది. ఈ సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అయితే దీనిపై ట్రంప్ మరో కొత్త ఎత్తుగడ వేశారు. కోర్టు నిర్ణయం సరైనది కాదంటూనే సుంకాల బాదుడు మొదలు పెట్టారు. అన్ని దేశాలపై 10 శాతం సుంకాలను విధిస్తూ కొత్త ఉత్తర్వుపై సంతకం పెట్టారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి. పెట్టుబడిదారులు అలర్ట్ అయ్యారు. డాలర్ మీద నుంచి తమ పెట్టుబడులను బంగారం మీదకు మళ్లించారు. దీంతో డాలర్ పతనం కాగా బంగారం, వెండి ధరలు పైపైకి ఎగబాకాయి. ఫిబ్రవరి 23న బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు 10 గ్రాములకు రూ 2 లక్షలకు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 23, సోమవారం దేశంలోని బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,070 పెరిగి రూ.1,61,350 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,900 పెరిగి రూ.1,47,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,500 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,48,050 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,61,350 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,47,900 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,110 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,48,600 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,350 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,900 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.10,000 పెరిగి రూ.3,00,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..

మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

వామ్మో.. రెండు తలల పాము.. బెంబేలెత్తిన జనం

Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

ఇటు సినిమాలు.. అటు బిజినెస్.. మనోళ్లు అస్సలు తగ్గట్లేదుగా..!

Follow Us