మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక
జార్ఖండ్‌లోని కుమారదుంగిలో మంత్రగత్తె నెపంతో ఒక మహిళను, ఆమె ఏడాది పసికందును సజీవ దహనం చేసిన దారుణం నాగరిక సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మూఢనమ్మకాలకు బలై, కిరోసిన్ పోసి నిప్పంటించగా తల్లి, బిడ్డ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘోరానికి కారణమైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జార్ఖండ్‌లో జరిగింది. మంత్రగత్తె నెపంతో ఒక మహిళను, ఆమె ఏడాది వయసున్న పసికందును కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన ఘోరం వెలుగు చూసింది. కుమారదుంగి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణంపై మృతురాలి భర్త పోలీసులకి ఫిర్యాదు చేసాడు. మృతురాలి భర్త తరపు బంధువు ఒకరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించారు. అయితే, ఆ మహిళ చేసిన చేతబడి వల్లే అతను చనిపోయాడని స్థానికులు కొందరు నమ్మారు. అర్ధరాత్రి అలికిడికి భార్యాభర్త లేచి చూడగా దాదాపు 12 మంది వారి ఇంటిపై దాడి చేశారు. భార్యాభర్తలిద్దరినీ బయటకు లాగి ఘర్షణకు దిగారు. గందరగోళం మధ్య, ఆమె చేతిలో ఏడాది బాబు ఉండగానే దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. తల్లి, బిడ్డ అక్కడికక్కడే మంటల్లో కాలి బూడిదయ్యారు. ఈ దాడిలో భర్త కూడా గాయపడగా, అతడు ఎలాగోలా ప్రాణాలతో తప్పించుకుని రాత్రంతా బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో తల్లి గుండెలకు హత్తుకున్న ముక్కుపచ్చలారని ఏడాది పసికందును, మూఢత్వం రగిల్చిన మంటలు బూడిద చేశాయి. చేతబడి అన్న ముద్ర.. కన్నపేగును, అమ్మ ఒడిని నిలువునా దహించింది. అక్కడ కాలిపోయింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు. ఈ సమాజపు మానవత్వం కూడా. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు జగన్నాథ్‌పూర్ ఎస్డీపీవో రాఫెల్ ముర్ము తెలిపారు. కేవలం మూఢనమ్మకాలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దాడిలో పాల్గొన్న ఇతర మహిళలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. గాయపడిన భర్తను చికిత్స నిమిత్తం కుమారదుంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. రెండు తలల పాము.. బెంబేలెత్తిన జనం
Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్ లెవలే వేరేగా ఉండు
ఇటు సినిమాలు.. అటు బిజినెస్.. మనోళ్లు అస్సలు తగ్గట్లేదుగా..!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

