రాకింగ్ స్టార్ యశ్ మాస్టర్ ప్లాన్
కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాకింగ్ స్టార్ యశ్.. ఇప్పుడు మరో సాహసానికి సిద్ధమయ్యారు. ఒక సినిమా కోసం దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ హీరో, ఇప్పుడు రాబోతున్న కొత్త ప్రాజెక్ట్‌తో ఏకంగా మూడు బాధ్యతలు భుజాన వేసుకున్నారు. ఇంతకీ యశ్ వేస్తున్న ఆ మాస్టర్ మైండ్ స్కెచ్ ఏంటి అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.
కేజీఎఫ్ సిరీస్‌తో కన్నడ సినిమా రేంజ్‌ను ఎల్లలు దాటించిన యశ్, ఆ మూవీతో నేషనల్ వైడ్‌గా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, భారీ మార్కెట్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కియారా అద్వానీ, నయనతార లాంటి బిగ్ కాస్టింగ్‌తో ఈ సినిమా గ్లోబల్ రేంజ్‌లో తెరకెక్కుతోంది.కేవలం యాక్టర్‌గానే కాకుండా ఈ సినిమాతో నిర్మాతగానూ మారారు యశ్. కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి తన సొంత బ్యానర్ ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. క్రియేటివ్ డెసిషన్స్ దగ్గరి నుంచి ప్రొడక్షన్ వ్యవహారాల వరకు అన్నీ తానై చూసుకుంటూ, సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు యశ్.నటుడిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు మోస్తున్న యశ్.. ఇప్పుడు తాజాగా డిస్ట్రిబ్యూటర్‌గానూ కొత్త అవతారం ఎత్తారు. కర్ణాటకలో ఈ సినిమాను తన సొంత బ్యానర్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆగస్టు 26న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా మీద యశ్ పెట్టుకున్న నమ్మకం, ఒకేసారి మూడు పడవల ప్రయాణం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

