
బోనాలు
ఆషాడ మాసం వస్తుంటే చాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండగ సందడి మొదలవుతుంది. ఆషాఢ మాసానికి తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలకు విడదీయరాని అనుబంధం శతాబ్దాలుగా పెనవేసుకుని విరాజిల్లుతోంది బోనాల పండగ. ఈ పండుగను ప్రధానంగా హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లోని పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటారు. తెలంగాణ ఆడబడుచులు అంగరంగ వైభవంగా జరిగే బోనాల జాతరకు ముహర్తం ఫిక్స్ అయింది. రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగ 2025 ఏడాదికి సంబంధించి ఆషాడం బోనాల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 26వ తేదీ గురువారం చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించడంతో బోనాలు సంబురాలు మొదలవుతాయి
తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని మొదటి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బోనాల సంబురాలకు శ్రీకారం చుడతారు. బంగారు బోనంతో సంబురాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది బోనాలు జూన్ 26వ తేదీన ప్రారంభమై జూలై 24వ తేదీతో ముగియనున్నాయి. ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు బోనాల జాతరకు తరలిరానున్నారు అని భావిస్తున్న తెలంగాణా రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్ల కోసం రూ. 20 కోట్ల రూపాయలను కేటాయించింది.
వర్షాకాలంలో తలెత్తే సీజనల్ వ్యాధులు, ఇబ్బందులు రాకుండా మమ్ము కాచి కాపాడు అమ్మ అంటూ మహిళలు బోనం ఎత్తుతారు. అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో పెట్టి గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మలకు పసుపు కుంకుమలు, చీరసారెలతో సమర్పిస్తారు
Bonalu Festival: తెలంగాణ బోనాల పండుగకి 600 ఏళ్ల చరిత్ర.. ఎందుకు చేస్తారంటే.?
తెలంగాణ బోనాలు పండుగ 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్రముఖ సాంస్కృతిక ఉత్సవం. ఈ పండుగలో మహిళలు అమ్మవారికి బోనం (ఆహారం) సమర్పిస్తారు. ఆషాడ మాసంలో జరిగే ఈ వేడుకలు ఘంటాల ఊరేగింపులు, నృత్యాలు, భవిష్యద్వాణి రంగం వంటి అంశాలను కలిగి ఉంటాయి. అయితే ఈ వేడుక ఎందుకు చేస్తారో కొంతమందికి మాత్రమే తెలుసు. బోనాల పండుగ ఎందుకు చేస్తారో ఈరోజు తెలుసుకుందాం..
- Prudvi Battula
- Updated on: Jul 14, 2025
- 12:08 pm
Rangam Bhavishyavani LIVE: ముందే హెచ్చరిస్తున్నా.. ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. ప్రత్యక్ష ప్రసారం..
బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీరు పాటించాల్సినవి పాటించండి. అగ్నిప్రమాదాలు జరుగుతాయి. ముందే హెచ్చరిస్తున్నా అని చెప్పారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 14, 2025
- 10:35 am
Natu Kodi: బోనాల స్పెషల్ తెలంగాణ స్టైల్ నాటుకోడి కూర.. ఈ స్పెషల్ మసాలా మరవద్దు..
తెలంగాణ పండుగలలో బోనాలు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. అమ్మవారికి సమర్పించే నైవేద్యాలతో పాటు, ఇంటిల్లిపాదికీ కమ్మని విందు భోజనం చేయడం ఆనవాయితీ. ఈ బోనాల సందడిలో తప్పకుండా ఉండాల్సిన వంటకాల్లో ఒకటి.. ఘాటైన, రుచికరమైన తెలంగాణ స్టైల్ నాటుకోడి కూర! సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసే ఈ నాటుకోడి పులుసు, జొన్న రొట్టెలు లేదా వేడి అన్నంతో కలిపి తింటే ఆ రుచే వేరు. మరి మీ ఇంట్లో బోనాల పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చే ఈ ప్రత్యేకమైన తెలంగాణ నాటుకోడి కూరను ఎలా తయారుచేయాలో చూద్దామా!
- Bhavani
- Updated on: Jul 12, 2025
- 6:45 pm
నాలుగు సార్లు ఓడిపోయాడు.. ఆయనకు శాలువా కప్పండి! ఫిరోజ్ ఖాన్‌పై MIM ఎమ్మెల్యే సెటైర్లు
నాంపల్లి నియోజకవర్గంలోని 81 మందిర్ కమిటీలకు బోనాల పండుగ నిర్వహణకు చెక్కులను ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, ఎమ్మెల్సీ దయానంద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంయుక్తంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రాజకీయ పార్టీల మధ్య సామరస్యాన్ని ప్రదర్శించింది, ముఖ్యంగా మాజీద్ హుస్సేన్, ఫిరోజ్ ఖాన్ మధ్య సాధారణంగా ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయడం గమనార్హం.
- Noor Mohammed Shaik
- Updated on: Jul 9, 2025
- 6:59 pm
బోనాల స్పెషల్ : మటన్ కర్రీ ఇలా వండితే వావ్ అనాల్సిందే!
ప్రస్తుతం బోనాల పండుగ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. పల్లెల్లో పట్నంలో అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగను జరుపుతున్నారు. ఇక తెలంగాణలో పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో మటన్ గుమ గుమలు ప్రతి వాడలో వస్తుంటాయి. ఇక ఒకొక్కరూ ఒక్కో విధంగా మటన్ వండుతారు. అయితే మనం పల్లెటూర్లలో మటన్ కర్రీని సింపుల్‌గా టేస్టీగా ఎలా వండుతారో ఇప్పుడు చూద్దాం.
- Samatha J
- Updated on: Jul 9, 2025
- 7:00 pm
Bonalu Ghatam: బోనాల్లో ఘటం ఊరేగింపు.. తర్వాత దీన్ని ఏం చేస్తారో తెలుసా?
తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, బోనాల పండుగలో అత్యంత కీలకమైన ఆచారం ఘటం తీయడం. మట్టి కుండలో అమ్మవారిని ఆవాహన చేసి, దానిని ఊరేగించడం ఈ పండుగలో ప్రత్యేక ఆకర్షణ. కేవలం ఒక మట్టిపాత్రగా కాకుండా, అమ్మవారి శక్తికి, పవిత్రతకు ప్రతీకగా నిలిచే ఈ ఘటం వెనుక ఉన్న ప్రాముఖ్యత, దాని ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.
- Bhavani
- Updated on: Jul 4, 2025
- 11:45 am
Delhi Bonalu: హస్తినలో ధూంధాంగా లాల్ దర్వాజ బోనాలు.. ఇండియా గేట్ వద్ద విరిసిన తెలంగాణ సంస్కృతీ శోభ..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వాటి నుంచి బోనాలు, బతుకమ్మ సహా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా తెలంగాణ పండుగలను ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు జరగని వేడుకలు సైతం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎంతో వైభవంగా తెలంగాణ పండుగలు ఢిల్లీలో జరుగుతున్నాయి. జూన్ 30 సోమవారం తెలంగాణ గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు.
- Gopikrishna Meka
- Updated on: Jul 9, 2025
- 7:02 pm
Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. బోనం అంటే ఏమిటి? ప్రాముఖ్యత.. బోనాల జాతర ఎప్పుడు మొదలైందంటే..
తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి చల్లగా చూడమని కోరుకుంటారు. ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చింది. ఆషాడ మాసం మొదటి గురువారం గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మకు తొలిబోనం సమర్పించడంతో బోనాల సంబురాలు షురూ అయ్యాయి.
- Surya Kala
- Updated on: Jul 9, 2025
- 7:03 pm
Poturaju: గ్రామదేవతలకే రక్ష.. పోతరాజుల ఆశీర్వాదంతో కలిగే ప్రయోజనమిదే
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు. ఈ పండుగలో గ్రామ దేవతలకు సమర్పించే బోనాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, వాటిని ఊరేగించేటప్పుడు ముందుండే 'పోతరాజు'లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. పసుపు, కుంకుమలు పూసుకుని, చేతిలో కొరడాలతో నృత్యం చేసే పోతరాజులు లేకుండా బోనాల జాతర అసంపూర్ణం అని నమ్ముతారు. అసలు పోతరాజులు ఎవరు? బోనాల పండుగలో వారి పాత్ర ఏమిటి? వారి ప్రాముఖ్యతకు గల కారణాలు ఏంటి? తెలుసుకుందాం.
- Bhavani
- Updated on: Jul 9, 2025
- 7:03 pm
Bonalu Festival: బోనాల సంబరాలు షురూ.. గోల్కొండ జగదాంబికకి తొలి బోనం సమర్పణ..క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు
తెలంగాణలో బోనాల సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో గోల్కోండ కోటలోని జగదాంబిక అమ్మవారికి అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ కోటకు రాజకీయ నేతలు, భక్తులు భారీగా క్యూ కట్టారు.
- Surya Kala
- Updated on: Jul 9, 2025
- 7:02 pm