AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలను వేధించే ఆకతాయిల ఆటకట్టిస్తున్న షీటీమ్స్‌.. బోనాలు, మొహర్రం వేళ 478 మందిని పట్టుకున్న షీ టీమ్స్

హైదరాబాద్‌లో జరిగిన బోనాలు, మొహర్రం ఉత్సవాల సందర్భంగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 478 మందిని షీ టీమ్స్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వీరిలో 386 మంది మేజర్లు కాగా, 92 మంది మైనర్లు ఉన్నారు. వీరిలో 288 మందిని హెచ్చరించి వదిలిపెట్టగా.. నలుగురిపై పెట్టీ కేసులు నమోదు చేసి రూ.1,050 ఫైన్ విధించారు.

మహిళలను వేధించే ఆకతాయిల ఆటకట్టిస్తున్న షీటీమ్స్‌.. బోనాలు, మొహర్రం వేళ 478 మందిని పట్టుకున్న షీ టీమ్స్
She Teams
Ranjith Muppidi
| Edited By: TV9 Telugu|

Updated on: Jul 18, 2025 | 1:05 PM

Share

హైదరాబాద్‌ మహానగరంలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. మహిళలను టార్గెట్‌గా చేసుకొని కొందరు అల్లరి మూకలు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇవే కాకుండా పండగలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల సందర్భాలలో కూడా జనాల మధ్యకు చేరి చిల్లర వేశాలు వేస్తున్నారు. వీరిపై దృష్టిపెట్టిన షీటీమ్స్‌ ఆకతాయిల ఆటపట్టించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో జరిగిన బోనాలు, మొహర్రం ఉత్సవాల సందర్భంగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 478 మందిని షీ టీమ్స్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వీరిలో 386 మంది మేజర్లు కాగా, 92 మంది మైనర్లు ఉన్నారు. వీరిలో 288 మందిని హెచ్చరించి వదిలిపెట్టగా.. నలుగురిపై పెట్టీ కేసులు నమోదు చేసి రూ.1,050 ఫైన్ విధించారు.

గోల్కొండ బోనాలు, బల్కంపేట యల్లమ్మ గుడి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద మహిళా భక్తులను వేధిస్తున్న వారిని షీ టీమ్స్ బృందాలు పట్టుకున్నాయి. మొత్తం ఐదు కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. అందులో ఒకరికి జైలు శిక్షతోపాటు జరిమానా విధించగా, మిగతా నలుగురికి రూ.50 చొప్పున జరిమానా విధించారు.. మరో నలుగురికి రూ.50 చొప్పున జరిమానాలు విధించారు.

ఈ ఉత్సవాల సందర్భంగా మహిళల భద్రత కోసం 14 టీమ్స్‌ యాక్షన్‌లోకి దిగాయి. ఇందులో భాగంగానే మహిళల భద్రతపై హైదరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 8 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ ప్రత్యేక బృందాలు నగర వ్యాప్తంగా 124 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 1,405 పబ్లిక్ స్పేస్‌లలో SHE టీమ్స్ మోనిటరింగ్ నిర్వహించారు. 352 అవగాహన ర్యాలీలు AV వాహనాల ద్వారా నిర్వహించాయి. ఈ మొత్తం చర్యల ద్వారా నగరంలోని మహిళల భద్రతపై అవగాహన పెంచడంలో షీ టీమ్స్ పాత్ర కీలకంగా నిలిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.