హైదరాబాద్లోని షేక్పేట్ పెట్రోల్ బంకు వద్ద ఇంధనం నింపుకున్న స్కూటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టోలీచౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బంకు సిబ్బంది, స్థానికుల సత్వర స్పందనతో మంటలను అదుపులోకి తెచ్చి, పెట్రోల్ బంకుకు మంటలు వ్యాపించకుండా పెను ప్రమాదాన్ని నివారించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.