AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోల రికార్డులే... దర్శకులకు ఇప్పుడు అతిపెద్ద పరీక్ష..!

స్టార్ హీరోల రికార్డులే… దర్శకులకు ఇప్పుడు అతిపెద్ద పరీక్ష..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 18, 2026 | 4:28 PM

Share

పాన్ ఇండియా స్టార్ హీరోలు సెట్ చేసిన భారీ బాక్సాఫీస్ బెంచ్‌మార్క్‌లు ఇప్పుడు దర్శకులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తదుపరి సినిమాలతో గత రికార్డులను బద్దలు కొట్టాలనే అంచనాలు నెలకొన్నాయి. అట్లీ, సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకులు భారీ విజయాల కోసం సిద్ధమవుతుండగా, రాజమౌళి మాత్రం మహేష్ బాబుతో కాస్త భిన్న పరిస్థితిలో కనిపిస్తున్నారు.

పాన్ ఇండియా డైరెక్టర్స్ మీద ఒత్తిడి పెరుగుతోంది. ప్రీవియస్‌ మూవీస్‌తో హీరోలు సెట్ చేసిన బెంచ్ మార్క్‌ను, తర్వాతి సినిమాతో బ్రేక్ చేయాల్సిన ప్రజర్‌ దర్శకుల మీద కనిపిస్తోంది. స్టార్ హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా, ఆడియన్స్ అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత మరింత టెన్షన్ పెడుతోంది. గత చిత్రాల రికార్డులను చెరిపేసి, సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయాల్సిన ఆ స్టార్ దర్శకులు ఎవరు..? వాళ్లపై ఉన్న ఆ బెంచ్ మార్క్ టెన్షన్స్ ఏంటి..? బాహుబలితో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ప్రభాస్… ఆ తర్వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేసినా ఆ స్థాయి ఇంపాక్ట్ అయితే రాలేదు. బాహుబలి సెట్ చేసిన బెంచ్ మార్క్ పాన్ ఇండియా డైరెక్టర్స్‌కు ఇప్పటికీ ఒక ఎవరెస్ట్ లాగే ఉంది. దీంతో ప్రభాస్‌తో అప్‌కమింగ్ సినిమాలు చేస్తున్న దర్శకులందరికీ ఆ బెంచ్ మార్క్‌ను బీట్ చేయాలన్న టెన్షన్ పట్టుకుంది. ప్రజెంట్ సెట్స్‌ మీద ఉన్న ఫౌజీ, స్పిరిట్‌, కల్కి 2 సినిమాల్లో ఏదైనా బాహుబలి రేంజ్‌ సక్సెస్‌ కొట్టాలని గట్టిగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్‌. పుష్ప, పుష్ప 2 సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని రేంజ్‌ టార్గెట్ సెట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఫ్రాంచైజీతో బన్నీ ఇమేజ్ నేషనల్ లెవల్‌ను దాటి గ్లోబల్‌ రేంజ్‌కు చేరింది. అందుకే బన్నీ అప్‌ కమింగ్ మూవీస్‌ డైరెక్టర్స్ మీద ఆ రేంజ్ హిట్‌ ఇవ్వాల్సిన ప్రెజర్ కనిపిస్తోంది. ముఖ్యంగా అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న రాకా, లోకేష్ కనగరాజ్ కెప్టెన్సీలో చేయబోయే ఏఏ 23 సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దేవరతో కలెక్షన్ల సునామీ సృష్టించి తన మాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు తారక్. ఆ తరువాత వార్ 2 నిరాశపరిచిన ఆ ఎఫెక్ట్ తారక్‌ కెరీర్ మీద పెద్దగా కనిపించలేదు. దేవర రికార్డ్‌లను బీట్ చేసే బిగ్ హిట్ కోసం నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద డ్రాగన్‌తో ఆ కల నేరవేరుతుందని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే డ్రాగన్‌తో బిగ్ హిట్ ఇవ్వాల్సిన ప్రెజర్‌లో ఉంది నీల్ టీమ్‌. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్‌ కాంబో మళ్ళీ ‘RC 17’ కోసం రిపీట్ అవుతుండటంతో.. ఫ్యాన్స్‌లో అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో గత రికార్డులను బ్రేక్ చేయాల్సిన డబుల్ ప్రెజర్ ఇప్పుడు సుకుమార్‌పై పడింది. అయితే ఈ బెంచ్ మార్క్ టెన్షన్స్ లిస్ట్‌లో రాజమౌళి మాత్రమే కాస్త సేఫ్‌గా కనిపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో గ్లోబల్ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ విషయంలో ఆ రేంజ్ టెన్షన్ లేదు. మహేష్ ఖాతాలో పాన్ ఇండియా రికార్డులు లేకపోవటం జక్కన్న కు కలిసొచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: టీమ్ అంతా ‘వారణాసి’ జపమే.. కానీ మహేష్ మాత్రం సైలెంట్! సూపర్ స్టార్ మౌనం వెనుక అసలు ప్లాన్ ఏంటి?

‘పుష్ప 2’ తర్వాత మరో బిగ్ సర్‌ప్రైజ్.. బాసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ?

Jason Sanjay: హీరోగా మారబోతున్న విజయ్ వారసుడు

సూపర్ హీరోల సీజన్ స్టార్ట్!.. అతీంద్రియ శక్తులతో బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్న సౌత్ స్టార్స్

Kriti Sanon: ఏ సినిమా పడితే అది కాదు.. క్వాలిటీ కథలకే ఓటేసిన కృతి సనన్.. పెళ్లిపైనా షాకింగ్ క్లారిటీ!

Follow Us