AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్థులతో కలిసి క్రికెట్ బ్యాట్ పట్టిన మాజీ టీమిండియా కెప్టెన్

ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ‌, ప‌బ్లిక్ ఎంట‌ర్ ప్రైజెస్ శాఖ మంత్రి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సందర్శించారు. విద్యార్థులతో మమేకమయిన ఆయన, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు.

Telangana: విద్యార్థులతో కలిసి క్రికెట్ బ్యాట్ పట్టిన మాజీ టీమిండియా కెప్టెన్
Azharuddin Arutla Public School
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jul 18, 2026 | 2:17 PM

Share

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మంత్రి అజారుద్దీన్ ఆరుట్ల పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. ఉదయం ఆరుట్ల చేరుకోన్న మంత్రి మహ్మద్ అజారుద్దీన్, మధ్యాహ్నం 2.00 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు టీపీఎస్‌లోనే గడిపారు. ప్రపంచ క్రికెట్ వేదికలపై తన అద్భుతమైన మణికట్టు షాట్లతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన అజారుద్దీన్, టీపీఎస్ విద్యార్థులకు క్రీడల్లో రాణించేందుకు అవసరమైన మెలకువలు, క్రమశిక్షణ, ఫిట్‌నెస్, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలపై సూచనలు చేసారు. అంతేకాకుండా, విద్యార్థులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. మాజీ భారత జట్టు కెప్టెన్‌తో కలిసి మైదానంలో ఆడే అరుదైన అవకాశం దక్కింది అని విద్యార్థులు అన్నారు.

పర్యటనలో భాగంగా పాఠశాలలోని తరగతి గదులు, డైనింగ్ హాల్స్, ప్లే గ్రౌండ్స్, క్రీడా మైదానాలు, హాస్టల్ వసతులు, పరిశుభ్రత, ఇతర మౌలిక సదుపాయాలను మంత్రి స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను నేరుగా అడిగి తెలుసుకొని, మరింత మెరుగైన విద్యా, క్రీడా వాతావరణం కల్పించేందుకు అవసరమైన సూచనలు అధికారులకు చేశారు మంత్రి అజారుద్దిన్.అదేవిధంగా మధ్యాహ్న భోజన వసతులు, పరిశుభ్రత ప్రమాణాలు, తాగునీటి సౌకర్యాలు, క్రీడా సామగ్రి అందుబాటుపై కూడా క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్శనలో భాగంగా మంత్రి మహ్మద్ అజారుద్దీన్ విద్యార్థులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. వారి విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాలు, క్రీడల పట్ల ఆసక్తి, కెరీర్ అవకాశాలపై చర్చిస్తూ విలువైన సూచనలు అందించారు.చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని విద్యార్థులకు ప్రేరణనిచారూ మంత్రి అజారుద్దీన్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విద్యార్థులతో కలిసి బ్యాట్ పట్టిన మాజీ టీమిండియా కెప్టెన్
విద్యార్థులతో కలిసి బ్యాట్ పట్టిన మాజీ టీమిండియా కెప్టెన్
జెర్రిపోతు పాము రైతులకు చేసే మేలు ఇదా..?
జెర్రిపోతు పాము రైతులకు చేసే మేలు ఇదా..?
దుకాణాలపై సోలార్ ప్యాలెన్స్ ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ వస్తుందా..
దుకాణాలపై సోలార్ ప్యాలెన్స్ ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ వస్తుందా..
వైఫై స్పీడ్‌ పెంచడం ఇంత ఈజీనా.. అబ్బా ఇన్నాళ్లు తెలీదే
వైఫై స్పీడ్‌ పెంచడం ఇంత ఈజీనా.. అబ్బా ఇన్నాళ్లు తెలీదే
ప్రశాంతంగానే ఉంటుంది.. జోలికి వస్తే కాళ్లతో సమాధానం చెప్తుంది..
ప్రశాంతంగానే ఉంటుంది.. జోలికి వస్తే కాళ్లతో సమాధానం చెప్తుంది..
హైదరాబాద్‌లో మటన్ పేరుతో కల్తీ మాంసం విక్రయం.. DNA పరీక్షల్లో..
హైదరాబాద్‌లో మటన్ పేరుతో కల్తీ మాంసం విక్రయం.. DNA పరీక్షల్లో..
సేమియా సగ్గు బియ్యం పాయసం.. కమ్మకమ్మగా ఎలా చేయాలంటే?
సేమియా సగ్గు బియ్యం పాయసం.. కమ్మకమ్మగా ఎలా చేయాలంటే?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై ఆర్బీఐ నుంచి బిగ్ అప్డేట్
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై ఆర్బీఐ నుంచి బిగ్ అప్డేట్
హోటల్ వద్ద జట్టుకు దూరంగా వెళ్లిన విరాట్ కోహ్లీ
హోటల్ వద్ద జట్టుకు దూరంగా వెళ్లిన విరాట్ కోహ్లీ
లో దుస్తులు మిస్సింగ్.. తెల్లారేసరికి మళ్లీ అక్కడే ప్రత్యక్షం..
లో దుస్తులు మిస్సింగ్.. తెల్లారేసరికి మళ్లీ అక్కడే ప్రత్యక్షం..