ఎలెందర్ రెడ్డి టీవీ9 తెలుగు స్పెషల్ కరస్పాండెంట్.14 ఏళ్లుగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.2021 ఏప్రిల్ నుండి టీవీ9 లో విధుల నిర్వహణ. 5ఏళ్లుగా టీవీ9 తెలుగు హైద్రాబాద్ బ్యూరో లో
హెల్త్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లలో ఎన్నో కొత్త మరియు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రజల ముందుకు తీసుకోచ్చారు.టీవీ9 కు ముందు డిల్లీ లోనూ పనిచేసిన అనుభవం.స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లతో ఎన్నో అంశాలను టీవీ9 వీక్షకులకు అందించారు.
Telangana RTC: దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం!
Telangana RTC: ఈ దసరా పండుగకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి..
- Yellender Reddy Ramasagram
- Updated on: Oct 7, 2026
- 6:58 pm
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు.. లేదంటే మీ ఇళ్లు గుల్లే!
దసరా, దీపావళి సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు పోలీసుల కీలక సూచనలు జారీ చేశారు. నగరంలో దొంగలు ఎక్కువైపోయారని.. ప్రజలు ఊళ్లకు వెళ్లేటప్పుడు బ్యాంక్ లాకర్లు, బలమైన తాళాలు, సెన్సార్ లైట్లు, సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరిచారు. కావాలంటే సేఫ్టీ కోసం లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టమ్ ఉపయోగించుకోవాలపి సూచించారు. అలాగే మీ ప్రయాణ వివరాలు సోషల్ మీడియాలో పంచుకోకపోవడం వంటివి చేయొద్దన్నారు. అప్రమత్తతే ఉత్తమ రక్షణ అని పోలీసులు ప్రజలకు సూచించారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Oct 7, 2026
- 2:06 pm
సోషల్ మీడియాలో వైరల్ డైట్స్..నమ్మితే మాత్రం ఆరోగ్యం రిపేర్
సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక కొత్త డైట్ వైరల్ అవుతోంది. బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండటానికి అంటూ ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే చిట్కాలను గుడ్డిగా ఫాలో అయితే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఒకరికి పనిచేసిన డైట్ ఇంకొకరికి పనిచేయాలని లేదు. మన శరీర తత్వాన్ని బట్టి సమతుల ఆహారం - కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఫైబర్ అన్నీ సరైన మోతాదులో తీసుకోవడమే అసలైన ఆరోగ్యం. అందుకే సొంతంగా డైట్స్ మొదలుపెట్టకుండా క్లినికల్ డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Sep 30, 2026
- 6:56 pm
Telangana: లైసెన్స్ కావాలంటే.. ఏఐని మెప్పించాల్సిందే.. ఇకపై టెస్ట్ పాస్ అవ్వడం ఈజీ కాదు భయ్యా..
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఇకపై అంత సులువు కాదు.. డ్రైవింగ్ టెస్టుల్లో రికమండేషన్లు, పైరవీలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు రవాణా శాఖ సరికొత్త టెక్నాలజీని రంగంలోకి దించుతోంది. ఇకపై మానవ ప్రమేయం లేకుండా.. పక్కాగా ఏఐ నిఘా నీడలోనే డ్రైవింగ్ పరీక్షలు జరగనున్నాయి. తొలి దశలో ఏయే ప్రాంతాల్లో ఈ విధానం రాబోతుంది? నిబంధనలు ఎంత కఠినంగా మారనున్నాయి? అనేది తెలుసుకుందాం..
- Yellender Reddy Ramasagram
- Updated on: Sep 29, 2026
- 6:33 pm
రోజూ అలసటగా అనిపిస్తోందా? మీ శరీరానికి కావాల్సిన టాప్ 5 ఎనర్జీ బూస్టర్లు ఇవే
రోజూ నీరసం, అలసట వేధిస్తున్నాయని వెంటనే మెడికల్ షాపునకు వెళ్లి విటమిన్ ట్యాబ్లెట్ లు వాడుతున్నారా? అయితే జాగ్రత్త మన వంటింట్లో లభించే ఆహార పదార్థాలు, రోజువారీ అలవాట్లతోనే ఈ 5 రకాల పోషకాలను సహజంగా పొందవచ్చు. ఎలాంటి మందులు వాడకుండానే శరీరానికి తగినంత ఎనర్జీని అందించి రోజంతా యాక్టివ్‌గా ఉండే మార్గాలు మన రోజు జీవితం లోనే ఉన్నాయి.అవేంటో తెలుసుకుందాం.
- Yellender Reddy Ramasagram
- Updated on: Sep 24, 2026
- 5:29 pm
Weight Loss: బరువు తగ్గాలంటే ఇవి కూడా చేయాల్సిందే.. ICMR తాజా సర్వేలో సంచలన నిజాలు!
మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నారా?.. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. చాలా మంది కేవలం డైట్ ఫాలో అయితే బరువు తగ్గుతామని అనుకుంటారు. కానీ తాజాగా ICMR-NIN చేసిన పరిశోధనలో బరువు తగ్గేందుకు ఇదొక్కటే సరిపోదని తేలింది.. కాబట్టి బరువు తగ్గాలంటే ఏం చేయాలి.. ఈ పరిశోధన ఏం చెప్తోందో ఇక్కడ తెలుసుకోండి.
- Yellender Reddy Ramasagram
- Updated on: Sep 13, 2026
- 1:23 pm
Hyderabad: అర్థరాత్రి మరిన్ని రూట్లలో నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులు.. స్టాప్‌ల వివరాలివే..
హైదరాబాద్‌లో అర్ధరాత్రి ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఆరు ప్రధాన రూట్లలో నడుస్తున్న ఈ సర్వీసులకు మంచి స్పందన లభిస్తోంది. కోఠి–పటాన్‌చెరు, అఫ్జల్‌గంజ్–పటాన్‌చెరు, సికింద్రాబాద్–పటాన్‌చెరు, హయత్‌నగర్–సికింద్రాబాద్ తదితర రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. ప్రాంతాల వారీగా స్టాప్‌లు, ట్రిప్పులు, ఫ్రీక్వెన్సీ వివరాలు ఇవే.
- Yellender Reddy Ramasagram
- Updated on: Sep 8, 2026
- 5:46 pm
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. ప్రయాణికుడు మర్చిపోయిన రూ.3లక్షలు తిరిగిచ్చిన కండక్టర్!
ఎవరూ లేని ఓ ప్రదేశంలో డబ్బుల కట్టలతో ఉన్న ఓ బ్యాగ్ కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు. చడీ చప్పుడు లేకుండా దాన్ని తీసి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. కానీ ఇక్కడో కండక్టర్ మాత్రం దీని భిన్నంగా పూర్తి నిజాయితీతో వ్యవహరించిం. బస్సులో ఓ ప్రయాణికుడు మర్చిపోయి వెళ్లిన రూ.3లక్షల నగదు ఉన్న బ్యాగ్‌తిని తిరిగి బాధితుడికి అప్పగించి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Sep 6, 2026
- 6:53 am
NIMS: ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నిమ్స్‌లో ఉచితంగానే EHS ఓపీ సేవలు
NIMS: జనరల్ హాస్పిటళ్లకు అనుసంధానిస్తూ వెల్‌నెస్ సెంటర్లలోనూ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల కుటుంబాలకు మెరుగైన ఉచిత వైద్యం అందనుంది. అలాగే..
- Yellender Reddy Ramasagram
- Updated on: Sep 5, 2026
- 8:43 am
నిమ్స్‌లో పేద యువకుడికి పునర్జన్మ.. 3D మ్యాపింగ్‌తో అరుదైన ఉచిత గుండె శస్త్రచికిత్స!
30 ఏళ్ల దినసరి కూలీకి అరుదైన గుండె లయ సమస్య (Ventricular Premature Complexes) తలెత్తింది. లక్షల ఖర్చు భరించలేని అతడు నిమ్స్‌ను ఆశ్రయించాడు. నిమ్స్ వైద్యులు 3D ఎలక్ట్రోఅనాటమికల్ మ్యాపింగ్ ఉపయోగించి, అత్యంత సంక్లిష్టమైన రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కరోనరీ ధమని సమీపంలోని ప్రమాదకర కేంద్రాన్ని నిర్వీర్యం చేసి, ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ప్రాణరక్షక చికిత్సను అందించారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: Sep 4, 2026
- 10:42 am
హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. అందుబాటులోకి స్టీల్ బ్రిడ్జి!
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి కీలక పరిష్కారంగా మారనుంది. ఎస్‌ఆర్‌డీపీ కింద రూ.620 కోట్లతో 3.32 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో నిర్మించిన ఈ వంతెన చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు విస్తరించింది. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి కీలక పరిష్కారంగా మారనుంది. ఎస్‌ఆర్‌డీపీ కింద రూ.620 కోట్లతో 3.32 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో నిర్మించిన ఈ వంతెన చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు విస్తరించింది. నల్గొండ ఎక్స్‌రోడ్ నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ వరకు ప్రయాణ సమయం 40 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Sep 2, 2026
- 9:32 pm
కృష్ణాష్టమి వేళ GHMC సంచలన నిర్ణయం.. ఆ దుకాణాలు బంద్
GHMC కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పరిధిలో పశు వధశాలలు, రిటైల్ బీఫ్ విక్రయ దుకాణాలను పూర్తిస్థాయిలో మూసివేయాలని ఆదేశించింది. పండగ వేళ ప్రజల ఆధ్యాత్మిక భావోద్వేగాలను గౌరవించడంతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకే ఈ నిర్ణయం. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని GHMC హెచ్చరించింది.
- Yellender Reddy Ramasagram
- Updated on: Sep 2, 2026
- 5:56 pm