ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును 8.25 శాతంగా ఖరారు చేసింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే రేటును అందించారు. ఈపీఎఫ్ఓలోని ఏడు కోట్ల మందికి పైగా చందాదారులకు ఇది వర్తిస్తుంది.