కొన్నేళ్లుగా బండరాయి అనుకొని అలా వదిలేశారు.. తీరా తవ్వి చూస్తే మైండ్ బ్లాక్..!
వాగులో కొంతభాగం బయటపడ్డ ఆ రాతి విగ్రహాన్ని ఒక బండరాయి అనుకొని గత మూడేళ్లుగా ఊరంతా వాగులో వృధాగా వదిలేశారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మూడేళ్ల తర్వాత ఇసుక తొలగిస్తే అందులో నుండి భారీ విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. అతి పురాతన రాతి విగ్రహం విగ్రహాన్ని చూసి ఊరంతా షాకయ్యారు. ఆ విగ్రహానికి గుడి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాగులో అతి పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయట పడింది. ఓ వ్యక్తి దానిని గుర్తించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇసుక నుండి భారీ విగ్రహాన్ని బయటకు తీసి ఆ విగ్రహానికి గుడి నిర్మాణం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ విగ్రహం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం శివారులోని పెద్దవాగులో బయట పడింది. ఇసుకలో విష్ణుమూర్తి విగ్రహాన్ని గుర్తించి బయటకు తీశారు.

Ancient Statue Of Lord Vishnu
అయితే, మూడేళ్ల క్రితం విగ్రహంలోని కొంతభాగం ఇసుకలో కనిపించింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. బండరాయి కావచ్చని అలాగే వృథాగా వదిలేశారు. గత మూడేళ్లుగా పనికిరాని బండరాయిగా అందులోనే ఉండిపోతూ వచ్చింది. ఇటీవల ఇసుకలో విగ్రహం ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి వచ్చి గ్రామస్తుల సహాయతో జేసీబీ తెప్పించి బయటకు తీశారు. విగ్రహం ముక్కు, చేతి వేళ్ళు భాగం ధ్వంసమై ఉన్నాయి. పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత అతి పురాతన రాతి విష్ణుమూర్తి విగ్రహంగా గుర్తించారు. గ్రామస్తులు ఈ విగ్రహానికి గుడి కట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..