ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను.
సొంత అన్నను కడతేర్చిన కసాయి తమ్ముడు.. నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన మర్డర్..!
భూ వివాదం ఆ సోదరులను రాక్షసులుగా మార్చింది. తోబుట్టువులే మానవ మృగాలు అయ్యారు. గట్టు పంచాయతీ వారిని రాక్షసులుగా మార్చి నిండు ప్రాణాలు బలి తీసుకునేలా చేసింది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Jun 19, 2025
- 6:04 pm
పాఠశాల తరగతి గదిలో నుంచి అదే పనిగా శబ్ధాలు.. తొంగి చూసేసరికి కెవ్వు కేక..!
పరిసరాల పరిశుభ్రత లేకపోవడం.. ప్రభుత్వ పాఠశాలు, ఆశ్రమ పాఠశాలల పక్కనే పిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. వాటిని తొలగించకపోవడంతో స్కూళ్లలో పాములు, తేళ్లు స్వైర విహారం చేస్తున్నాయి. ఏకంగా తరగతి గదుల్లోకి ప్రవేశించి బుసలు కొడుతున్నాయి. హనుమకొండ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పాము హల్చల్ చేసింది. పంతుళ్ళను పరుగులు పెట్టించింది.
- G Peddeesh Kumar
- Updated on: Jun 18, 2025
- 4:39 pm
Telangana: ఏటూరునాగారం రిజర్వ్ ఫారెస్ట్లో హై టెన్షన్.. అటవీశాఖ అధికారులపైకి తిరగబడ్డ గిరిజనులు!
ములుగు జిల్లా ఏటూరునాగారం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా రణరంగంగా మారింది. అడవుల్లో గుడిసెలు వేసుకున్న ఆదివాసీలు అటవీ శాఖ సిబ్బంది పైకి కారం, కర్రలు, కొడవళ్ళతో తిరగ బడ్డారు. గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై శివమెత్తారు. ఆదివాసీలు, అటవీశాఖ సిబ్బంది మధ్య పోపులాటతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
- G Peddeesh Kumar
- Updated on: Jun 16, 2025
- 9:39 pm
Hanumakonda: ఇంటికి నిప్పుపెట్టిన చిట్టెలుక..
ఎలుక చూడండి ఎంత పని చేసిందో..! ఏకంగా ఓ ఇంటికి నిప్పు పెట్టింది.. ఆ ఇల్లంతా కాలి బూడిదయ్యేలా చేసింది.. వింటుంటే విచిత్రంగా ఉన్నా అంతుచిక్కని విచిత్ర గాధ ఇది... ఎలుక వల్ల ఇల్లంతా కాలిపోయి నిరాశ్రయులైన ఆ కుటుంబం లబోదీబోమంటుంది.
- G Peddeesh Kumar
- Updated on: Jun 16, 2025
- 2:19 pm
Telangana: ఆ సేవకుడికి వానరమే ఆత్మీయ బంధువు అయింది.. పోయాక కన్నీళ్లు రాల్చి ఆశ్చర్యపరిచింది
ఆ గుడి శుద్ధి చేసి గుళ్లో మిగిలిన ప్రసాదాలు ఓ కోతికి పెట్టే సేవకుడి మరణం ఊరందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. అతని శవంపై పడి వానరం రోదించిన తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. ఆ సేవకుడికి చివరకు ఆ వానరమే తోబుట్టువు అయ్యింది. నాలుగు కన్నీటి చుక్కలు రాల్చి చూపరులంతా ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ విచిత్ర సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం బిసిమర్రిగూడెం గ్రామంలో జరిగింది.
- G Peddeesh Kumar
- Updated on: Jun 15, 2025
- 7:01 pm
Warangal: మహిళ మర్డర్ మిస్టరీ వీడింది.. చంపింది ఎవరో కాదు.. ఇంట్లో వ్యక్తే.. అసలేం జరిగిందంటే..
వరంగల్లో జరిగిన ఓ వృద్ధురాలి మర్డర్ మిస్టరీ పోలీసులు చేధించారు. కొడుకే సవతితల్లిని హత్య చేసినట్లుగా గుర్తించారు.. ఆస్తి వివాదమే హత్యకు కారణమని తేల్చిన పోలీసులు నిందితుడని అరెస్టు చేసిన రిమాండ్కు పంపారు. ఈ హత్య హనుమకొండ శివారులోని పెగడపల్లి గ్రామంలో జరిగింది..
- G Peddeesh Kumar
- Updated on: Jun 14, 2025
- 3:46 pm
Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
అల్లారుముద్దుగా చూసుకున్న మేనత్త బంగారంపై కన్నేసిన ఓ కంత్రిగాడు ఆమెను అతికిరాతకంగా హత్య చేశాడు. అచ్చం సినీ పక్కిలో పోలీసుల దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు. కథ అడ్డం తిరిగి ఖాకీలకు చిక్కాడు. టెక్నాలజీ ఆధారంగా మర్డర్ మిస్టరీని పోలీసులు చాకచక్యంగా చేదించి ఆ కేటుగాన్ని అరెస్ట్ చేశారు. హత్య అనంతరం దోసుకుపోయిన బంగారం అంతా కక్కించి అతన్ని కటకటల్లోకి పంపారు.
- G Peddeesh Kumar
- Updated on: Jun 13, 2025
- 6:42 pm
ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను.. నా అందాన్ని చూసి నాకే జలసీగా ఉంది.. అద్దంలో చూసుకొని మురిసిపోయిన కోతి!
వరంగల్ జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. నరంలో సంచరిస్తున్న ఓ కోతికి రోడ్డుపై ఓ అద్దం దొరికింది. ఇంకేముంది. దాన్ని తీసుకొని వెళ్లి ఓ గోడపై కూర్చొని దాంట్లో తన ప్రతిబింబాన్ని పదేపదే చూసుకుంటూ తెగమురిసిపోయింది. దీన్ని గమనించిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో కాస్తా ప్రస్తుతం ట్రెంగింగ్లోకి వచ్చింది.
- G Peddeesh Kumar
- Updated on: Jun 13, 2025
- 3:01 pm
వీడు మామూలోడు కాదు.. ప్రేయసి కోసం ఎంతకు తెగించాడు.. సీన్ చూస్తే.!
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనేదీ నానుడి. కానీ ప్రియురాలి మైకంలో సొంత ఇంటికి కన్నం వేసి కన్నతల్లి బంగారం మాయం చేసిన కంత్రీగాడు అడ్డంగా బుక్కయ్యాడు. వరంగల్ నగరంలో అచ్చం సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దొంగిలించిన బంగారమంతా రికవరీ చేసి, ఆ విద్యార్థిని కటకటాల్లోకి పంపారు.
- G Peddeesh Kumar
- Updated on: Jun 10, 2025
- 5:28 pm
ఊహించని విధంగా జాక్ పాట్ కొట్టిన కొత్త జంట.. ఏకంగా ప్రధాని మోదీ నుంచే..!
మహబూబాబాద్ జిల్లాలో ఓ కొత్త జంటకు ఊహించని విధంగా జాక్ పాట్ తగిలింది.. ప్రధానమంత్రిని పెళ్లికి రావాలని లేఖ పంపిన ఆ జంటకు ఊహించని కానుక అందింది. ఏకంగా ప్రధాన మంత్రి సంతకంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ అందింది. ఆ జంట ఊహించని కానుకతో ఆనందం తో ఉప్పొంగిపోతున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Jun 8, 2025
- 5:27 pm
పెళ్లి ఇంట్లో ఊహించని విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు జల సమాధి..!
గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు జల సమాధి అయ్యారు. శనివారం(జూన్ 07) సాయంత్రం గల్లంతైన వారి మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు నిర్విరామంగా శ్రమించి వెలికి తీశారు. సరదా కోసం వెళ్లి విగతజీవులుగా మారిన చూసి, మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నేరుగా విలపించారు. పెళ్లి ఇంట్లో ఊహించని విషాదం అలముకుంది.. రెండు గ్రామాలలో రోదనలు మిన్నంటాయి.
- G Peddeesh Kumar
- Updated on: Jun 8, 2025
- 5:04 pm
Telangana: పైకి చూసి పద్దతికి బ్రాండ్ అంబాసిడర్ అనుకునేరు.. అసలు మ్యాటర్ ఎంక్వయిరీలో తేలింది
సినిమాలు చూసి ఇలా ఇన్స్పైర్ అవుతారో.. లేక ఇలాంటి కేటుగాళ్లను ఆదర్శంగా తీసుకుని సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయో ఏమో కానీ.. హనుమకొండ జిల్లాలో వరుస దొంగతనాలతో హల్చల్ చేసిన ఓ ఘరానా దొంగ అడ్డంగా బుక్కయ్యాడు. తన గ్రామంలో వరుస దోపిడీలకు పాల్పడి అతనే పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణలో వారిని తప్పుదారి పట్టించాడు. సీన్ కట్ చేస్తే.!
- G Peddeesh Kumar
- Updated on: Jun 7, 2025
- 11:57 am