కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు.. లాస్ట్ మినిట్‌లో అలా చేశారన్న మహేష్ విట్టా
టాలీవుడ్ లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వారిలో మహేష్ విట్టా ఒకరు. రాయలసీమ యాసలో కామెడీ చేస్తూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అలాగే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి సినిమాలు తెరకెక్కిస్తున్నాడు.

మహేష్ విట్టా యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు. షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఫన్ బకెట్ వీడియోలు మహేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రాయల సీమ యాసలో అతను చెప్పిన డైలాగులు నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇదే ఫేమ్ తో సినిమాల్లోకి అడుగు పెట్టాడు మహేష్. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్, ఇందు వదన తదితర సినిమాల్లో తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అలాగే బిగ్‌బాస్ 3వ, ఓటీటీ సీజన్‌లోనూ సందడి చేశాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఆకట్టుకుంటున్నాడు మహేష్. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మహేష్ విట్టా మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్
మహేష్ విట్టా మాట్లాడుతూ.. బెంగళూరులో ఎంసీఏ పూర్తి చేసి ఐటీ ఉద్యోగం చేస్తున్న మహేష్, సినిమాల పట్ల ఉన్న మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్ వచ్చా అని తెలిపాడు. 2016లో దర్శకుడు తేజ దగ్గర సహాయ దర్శకుడిగా అవకాశం కోరినప్పుడు, ఆయన సలహా మేరకు నటుడిగా మారానని.. తేజ అప్పట్లో తనతో “నువ్వు నటుడివైతే కనీసం డబ్బులు సంపాదిస్తావు, దర్శకుడిగా వద్దు” అని చెప్పినట్లు మహేష్ గుర్తుచేసుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలో స్నేహితులను కోల్పోవడం, చిన్న సినిమాలు విజయం సాధిస్తున్న తీరు చూసి మహేష్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి, తన మిత్రులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడట.
అప్పు.. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.!! సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హ్యాపీడేస్ నటి
అంతే కాదు అప్పులు చేయకుండా తన కష్టార్జితంతోనే సినిమాను పూర్తి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ తన సినిమా విజయం సాధించకపోయినా, తాను జీవించగలననే ధైర్యం ఉందని మహేష్ విట్టా అన్నారు. “దోస బండి పెట్టుకుని అయినా బతుకుతాను” అని చెప్పుకొచ్చాడు. అలాగే ఆయన మాట్లాడుతూ.. తన క్యాస్ట్ కారణంగా తనకు చాలా అవకాశాలు పోయాయి అని తెలిపారు. క్యారెక్టర్ ఇవ్వడం, డేట్స్ ఫిక్స్ చేయడం చివరి నిమిషంలో ఆ క్యారెక్టర్ వేరే వాళ్లకు ఇవ్వడం చేశారు అని తెలిపారు మహేష్ విట్టా ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అప్పట్లో రచ్చ లేపింది.. ట్రెండ్ సెట్ చేసిన గుడుంబా శంకర్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా.?
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




