ఆ సినిమాతో నా లైఫ్ మారిపోయింది.. చదువు కూడా ఆపేశా

27 July  2026

Pic credit - Instagram

Rajeev 

ప్రేమమ్ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది అందాల భామ  అనుపమ పరమేశ్వరన్. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది.

2015లో స్టార్ స్టేటస్ అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అయ్యింది.

చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. కానీ అనుపమకు అనుకున్నంతగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాల్లో నటించిన అనుపమకు.. స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ రాలేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా కలిసి రాలేదు.

2015లో ‘ప్రేమమ్’ సినిమాతో ఆమె సినీరంగుల జీవితాన్ని ప్రారంభించింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

అనుపమ కేవలం 19 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ అయ్యింది. మలయాళ ‘ప్రేమమ్’ ఆమె జీవితాన్ని మార్చేసింది.

ప్రేమమ్ సినిమా తర్వాత అనుపమకు వరుస ఆఫర్స్ రావడంతో కాలేజీ చదువును సగంలోనే వదిలేయాల్సి వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.