AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్లు సర్వనాశనం అవుతారు.. వెన్నుపోటు పొడిచారని ఎమోషనల్ అయిన చలాకీ చంటి

జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన హాస్యనటులు చాలా మంది ఉన్నారు. అందులో కమెడియన్ చలాకీ చంటి ఒకరు. తన చలాకీతనం.. కామెడీ టైమింగ్ తో.. తన స్టైల్లో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించారు. ఈ షో ద్వారా చాలా పాపులర్ అయ్యాడు. అలాగే సినిమాల్లో హాస్యనటుడిగా అలరించాడు.

వాళ్లు సర్వనాశనం అవుతారు.. వెన్నుపోటు పొడిచారని ఎమోషనల్ అయిన చలాకీ చంటి
Chalaki Chanti
Rajeev Rayala
|

Updated on: Mar 02, 2026 | 12:32 PM

Share

జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన కమెడియన్స్ తో చలాకి చంటి ఒకరు. తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు చలాకి చంటి. టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటించాడు చంటి. గత కొంతకాలంగా చంటి టీవీ షోలకు, సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంటి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలోని అనేక విషయాలను పంచుకున్నాడు చంటి. తాను ఇండస్ట్రీకి దూరమవడానికి గల కారణాలు, తనపై ఉన్న ఈగో ముద్ర, తన ఫ్రెండ్స్, తనకు జరిగిన నమ్మకద్రోహం వంటి అంశాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లను కూడా చంటి తీవ్రంగా ఖండించారు. తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని, బైపాస్ సర్జరీ జరిగిందని, తన కెరీర్ ముగిసిందని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారాలు చేశాయని ఆయన ఆరోపించారు.

తన ఆరోగ్యం గురించి అసత్య వార్తలు ప్రచారం చేసిన వారిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాళ్లు సర్వనాశనం అవుతారని, తాను బ్రతికి ఉండగానే అది చూడాలని శపించాడు చంటి. తనపై ఈగో అనే ఆరోపణ పదేళ్లుగా వెంటాడుతోందని చంటి పేర్కొన్నారు. 2013లో జబర్దస్త్ ప్రారంభమైతే, 2014 నుంచే ఈ చర్చ మొదలైందని తెలిపారు. కొంతమంది తనను వెన్నుపోటు పొడిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన తప్పు లేదని, నష్టపోయింది తానేనని స్పష్టం చేశారు. బిగ్ బాస్ కార్యక్రమం వల్ల తనకు ఎలాంటి లాభం లేదని చంటి నిర్మొహమాటంగా చెప్పాడు. కెరీర్‌కు గానీ, ఆర్థికంగా గానీ రూపాయి కూడా ప్రయోజనం కలగలేదని అన్నాడు.

మనుషులు డబ్బు ఉన్నప్పుడే చుట్టూ ఉంటారని, కష్టాల్లో ఉన్నప్పుడు నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుందని ఆయన అన్నారు. ఒక మనిషికి డబ్బు లేకపోతే సమాజంలో విలువ ఉండదని, తన అనుభవంలో అది నిజమని తెలిపారు. ఐదు వేల రూపాయలతో పార్టీకి పిలిచినప్పుడు పది పదిహేను మంది చుట్టూ ఉంటారని, కానీ 500 రూపాయలు అడిగితే వెంటనే పారిపోతారని, అటువంటి సమయంలో నిజమైన స్నేహితుడు ఎవరు అనేది తెలుస్తుందని అన్నాడు చంటి.  ఎవరైనా మోసం చేస్తే అది మోసపోయిన తన తప్పేనని, మోసం చేసిన వారి తప్పు కాదని చంటి చెప్పుకుకొచ్చాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us