తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన పార్వతి, తొలి ఏకాదశి సందర్భంగా రావి ఆకుపై అద్భుతమైన విష్ణుమూర్తి చిత్రాన్ని తీర్చిదిద్దింది. శంఖు చక్రాలు, ఆదిశేషుని పడగ నీడలో స్వామి వారిని సూక్ష్మంగా చెక్కింది. చిన్నప్పటి నుండి కళల పట్ల ఆసక్తి ఉన్న ఈమె, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు కూడా గెలుచుకుంది.