ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే సేఫ్ అవుతున్న మిడ్ రేంజ్ మూవీస్
టాలీవుడ్‌లో మీడియం రేంజ్ సినిమాలకు నాన్-థియేట్రికల్ బిజినెస్ భారీ ఊపునిస్తోంది. ఓటీటీ, శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారానే నిర్మాతలు విడుదలకు ముందే పెట్టుబడిలో పెద్ద భాగాన్ని రికవర్ చేసుకుంటున్నారు. వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’, అఖిల్ ‘లెనిన్’, అడివి శేష్ ‘డెకాయిట్’, సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రాలు ఈ ట్రెండ్‌కు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
టాలీవుడ్ మార్కెట్ సిచ్యుయేషన్ మీడియం రేంజ్ సినిమాలకు బాగా కలిసొస్తోంది. సినిమా బడ్జెట్‌లో ఏకంగా 70 పర్సెంట్ వరకు నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచే రాబట్టి రిలీజ్‌కు ముందే నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన అవుతున్న చాలా సినిమాల విషయంలో ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్స్ మేకర్స్‌లో కొత్త జోష్ తీసుకువస్తున్నాయి… ఏంటా మూవీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరి. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దూసుకుపోతోంది. 38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఇండో-కొరియన్ హారర్ కామెడీ.. రిలీజ్‌కి ముందే ఏకంగా 26 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ చేసి అదరగొట్టింది. కేవలం ఓటీటీ, హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులతోనే బడ్జెట్‌లో దాదాపు 72 శాతం రికవర్ చేసి నిర్మాతలకు జాక్‌పాట్ అందించింది. అఖిల్ అక్కినేని ‘లెనిన్’, అడివి శేష్ ‘డెకాయిట్’ సినిమాలు ఇదే రేంజ్‌లో బిజినెస్ చేశాయి. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లెనిన్.. నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే 34 కోట్లు రాబట్టింది. ఓటీటీ, హిందీ హక్కుల రూపంలోనే సగం పెట్టుబడి వెనక్కి తెచ్చేసింది. అటు అడివి శేష్ ‘డెకాయిట్’ కూడా రిలీజ్‌కి ముందే భారీ నాన్-థియేట్రికల్ డీల్స్‌తో నిర్మాతను నష్టాల నుంచి కాపాడింది. మీడియం రేంజ్ హీరోల సినిమాలే కాదు.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల కూడా నాన్-థియేట్రికల్ మార్కెట్‌లో ప్రూవ్ చేసుకున్నాయి. సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో బడ్జెట్ మొత్తం రికవర్ చేసింది. ఇలా మీడియం రేంజ్ సినిమాలు అడ్వాన్స్‌డ్‌గానే సేఫ్ అవుతుండటంతో టాలీవుడ్ బిజినెస్ ఫ్యూచర్ మీద కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మరి ఈ నాన్-థియేట్రికల్ సునామీని ముందు ముందు ఇంకెన్ని సినిమాలు క్యాష్ చేసుకుంటాయో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందేభారత్ స్లీపర్ అదుర్స్.. విదేశీ మహిళ ప్రశంసలు
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
ట్రెండ్ మారింది గురూ.. వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

