AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!

చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!

Phani CH
|

Updated on: Jul 26, 2026 | 2:55 PM

Share

హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ స్వామి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సమస్యలతో మానసిక ఒత్తిడికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. “నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు.. నా కుటుంబాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టొద్దు” అంటూ ఆయన రాసిన సూసైడ్ నోట్ అందరినీ కలచివేస్తోంది.

హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ స్వామి గురువారం తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఆఫీస్ వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. హఠాత్తుగా తుపాకీ శబ్దం విన్న తోటి సిబ్బంది అక్కడికి వెళ్లి చూడగా, స్వామి రక్తపు మడుగులో పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ సంబంధిత సమస్యల వల్ల కలిగిన తీవ్ర మానసిక ఒత్తిడే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న స్వామి వ్యక్తిగత డైరీలోని అంశాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. సూసైడ్‌ నోట్‌ ప్రకారం..”నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు. నా భార్యాపిల్లలను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దు. ఈ లోకం నుంచి వెళ్లిపోయినా, చనిపోయాక దెయ్యంగా మారైనా నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను” అని స్వామి ఎంతో ఆవేదనతో డైరీలో రాశారు. స్వామి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగుల వాంగ్మూలాలు సేకరిస్తూ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!

ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!

ట్రెండ్‌ మారింది గురూ.. వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!

ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!

17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!

Follow Us