AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!

ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!

Phani CH
|

Updated on: Jul 26, 2026 | 2:47 PM

Share

పర్స్‌ను అల్యూమినియం ఫాయిల్‌తో చుడితే బ్యాంక్ కార్డుల డేటా సురక్షితంగా ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాస్త్రీయంగా ఫాయిల్ రేడియో సిగ్నల్‌లను అడ్డుకోవడం నిజమే అయినా, ఆర్‌ఎఫ్‌ఐడీ స్కిమ్మింగ్ ఘటనలు చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు. ఫాయిల్ కంటే ఆర్‌ఎఫ్‌ఐడీ-బ్లాకింగ్ వాలెట్లు ఉపయోగించడం, ఫిషింగ్ లింకులు, ఓటీపీ మోసాలపై అప్రమత్తంగా ఉండటమే ఉత్తమ భద్రత అని సూచిస్తున్నారు.

పర్స్‌ను అల్యూమినియం ఫాయిల్‌తో చుడితే బ్యాంక్ కార్డుల డేటా సురక్షితంగా ఉంటుందనే ఒక కొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డుల్లో ఉండే ఆర్‌ఎఫ్‌ఐడీ , ఎన్‌ఎఫ్‌సీ చిప్‌ల ద్వారా స్కానర్లతో డేటా దొంగిలిస్తారనే భయంతో చాలామంది ఈ పద్ధతిని పాటిస్తున్నారు. అయితే ఈ పద్ధతి నిజంగా పనిచేస్తుందా? లేక ఇది కూడా సోషల్ మీడియా ప్రచారమేనా? ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం చాలా డెబిట్, క్రెడిట్ కార్డులు, పాస్‌పోర్టుల్లో ఆర్‌ఎఫ్‌ఐడీ , ఎన్‌ఎఫ్‌సీ చిప్‌లు ఉంటాయి. వీటి ద్వారా కార్డును స్వైప్ చేయకుండానే ‘ట్యాప్ అండ్ పే’ చెల్లింపులు చేయొచ్చు. అయితే ప్రత్యేకమైన స్కానర్‌లతో కొందరు దొంగలు ఈ సిగ్నల్‌ను దొంగిలించి కార్డు వివరాలు సేకరిస్తారనే భయంతో ఈ ట్రెండ్ మొదలైంది. శాస్త్రీయంగా చూస్తే అల్యూమినియం ఫాయిల్ ‘ఫారడే కేజ్’లా పనిచేసి రేడియో తరంగాలను అడ్డుకోవడం నిజమే. పర్స్‌ను ఖాళీలు లేకుండా చుడితే సిగ్నల్ బయటకు వెళ్లకుండా ఆగే అవకాశం ఉంటుంది. అయితే, నిజ జీవితంలో ఇలాంటి ఆర్‌ఎఫ్‌ఐడీ స్కిమ్మింగ్ ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కాంటాక్ట్‌లెస్ కార్డులు సీవీవీ, పిన్ వంటి పూర్తి సమాచారాన్ని ప్రసారం చేయవు. ప్రతిసారీ ఫాయిల్ చుట్టుకోవడం కంటే ఆర్‌ఎఫ్‌ఐడీ-బ్లాకింగ్ వాలెట్లు లేదా కార్డ్ స్లీవ్‌లు ఉపయోగించడం మంచి ప్రత్యామ్నాయం. ప్రస్తుతం డిజిటల్ మోసాలు ఎక్కువగా ఫిషింగ్ లింకులు, ఓటీపీ స్కామ్‌ల ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి ఫాయిల్ ప్రయోగాల కంటే ఆన్‌లైన్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండటం, బ్యాంక్ అలర్ట్‌లు పరిశీలించడమే అసలైన భద్రత అని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!

డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం.. మిస్టరీ ఛేదించిన శాస్త్రవేత్తలు!

Follow Us