AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం.. మిస్టరీ ఛేదించిన శాస్త్రవేత్తలు!

డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం.. మిస్టరీ ఛేదించిన శాస్త్రవేత్తలు!

Phani CH
|

Updated on: Jul 26, 2026 | 2:42 PM

Share

డైనోసార్ల అంతానికి కారణమైన గ్రహశకలం అత్యంత అరుదైన ‘CO కాండ్రైట్’ రకానికి చెందినదని తాజా పరిశోధన వెల్లడించింది. సుమారు 6.6 కోట్ల ఏళ్ల క్రితం మెక్సికోలోని యుకాటన్ తీరాన్ని ఢీకొన్న ఈ అంతరిక్ష శిల వల్ల భూమిపై 75 శాతం జీవజాతులు అంతరించిపోయాయి. ఈ పరిశోధన విశ్వ చరిత్రలోని అతిపెద్ద మహా వినాశనంపై కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది.

సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై నుంచి డైనోసార్ల జాతిని పూర్తిగా తుడిచిపెట్టేసిన గ్రహశకలం గురించి అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వెలికితీసింది. ఆనాటి మహా వినాశనానికి కారణమైన అంతరిక్ష శిల సౌర వ్యవస్థలోనే అత్యంత పురాతనమైన, అరుదైన ‘CO కాండ్రైట్’ రకానికి చెందినదని గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా , పారిస్, బ్రస్సెల్స్, వియన్నా పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనం వివరాలు ప్రముఖ ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆనాటి ప్రళయం తర్వాత ఏర్పడిన మట్టి పొరలోని నికెల్ ఐసోటోప్‌లను విశ్లేషించి పరిశోధకులు ఈ ముగింపునకు వచ్చారు. సుమారు 10 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్రహశకలం మెక్సికోలోని యుకాటన్ తీరాన్ని ఢీకొట్టి భారీ ‘చిక్సులబ్’ బిలాన్ని ఏర్పరచడంతో పాటు భూగ్రహంపై ఉన్న 75 శాతం జీవజాతులను నాశనం చేసింది. ఈ తీవ్ర ఘాతానికి విపరీతమైన భూకంపాలు, రాకాసి సునామీలు చెలరేగగా.. వాతావరణంలోకి దట్టంగా ఎగసిపడిన అతి సూక్ష్మ ధూళి కణాలు సూర్యకాంతిని కొన్నేళ్ల పాటు అడ్డుకోవడమే ఈ వినాశనానికి ప్రధాన కారణమని తేలింది. తాజా పరిశోధన ప్రకారం, భూమిపై లభించే గ్రహశకలాల అవశేషాల్లో ఈ ‘CO కాండ్రైట్’ రకం కేవలం 5 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ఇవి గురు గ్రహం సమీపంలోని బయటి ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి లేదా సౌర వ్యవస్థ చివరి సరిహద్దుల నుంచి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. విశ్వంలోనే అత్యంత అరుదైన ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టడం అప్పట్లో డైనోసార్ల దురదృష్టానికి నిదర్శనమని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఘాటెక్కిన వంటిల్లు..భగ్గుమంటున్న నిత్యావసర సరుకుల ధరలు

Viral Video: గడ్డికోస్తున్న గొర్రెలు.. ఎక్కడంటే ?

వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..

రిటైర్మెంట్ పొదుపు కోసం ఏది బెస్ట్ ?? మీకు సరిపోయే పొదుపు పథకం ఏది?

Auto Driver Love: నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!

Follow Us