వందేభారత్ స్లీపర్ అదుర్స్.. విదేశీ మహిళ ప్రశంసలు
వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమైన ఆరు నెలల తర్వాత కూడా పరిశుభ్రత, సేవలు అద్భుతంగా ఉన్నాయని విదేశీ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ అనుష ప్రశంసించారు. గౌహతి నుంచి కోల్‌కతా వరకు ప్రయాణించిన ఆమె విశాలమైన క్యాబిన్‌లు, శుభ్రమైన బాత్‌రూమ్‌లు, నాణ్యమైన ఆహారం తనను ఆశ్చర్యపరిచాయని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి భారతీయ రైల్వేకు ప్రశంసలు తెచ్చిపెడుతోంది.
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ రైళ్ల నిర్వహణ, పరిశుభ్రతపై ఓ విదేశీ ట్రావెలర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ అనుష, కామాఖ్య – హౌరా వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమైన ఆరు నెలల తర్వాత సేవలు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు గౌహతి నుండి కోల్‌కతా వరకు ఒంటరిగా ప్రయాణించారు. ప్రారంభంలో ఉన్న ఆర్భాటం ఆరు నెలల రద్దీ తర్వాత ఉండదని, రైలు మురికిగా తయారవుతుందని తాను భావించినట్లు ఆమె తెలిపారు. కానీ లోపలికి వెళ్లగానే క్యాబిన్ అత్యంత విశాలంగా, ఆధునికంగా, శుభ్రంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ముఖ్యంగా షవర్ ఏరియాతో కూడిన బాత్‌రూమ్‌లు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయని కొనియాడారు. అలాగే రైలు ప్రారంభించిన మొదటి రోజున అందించిన రుచికరమైన ఆహార నాణ్యతే, ఆరు నెలల తర్వాత కూడా కొనసాగుతోందని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు అందిస్తోందని, వాటిని శుభ్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులపైనే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
ట్రెండ్ మారింది గురూ.. వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

