సినిమాలకు గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
26 July 2026
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్, ఆ తర్వాత వెండితెరపై కథానాయికగా పరిచయమైంది.
2013లో 'ఉయ్యాల జంపాల' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, ‘సినిమా చూపిస్తా మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’,
‘రాజు గారి గది 3’, ‘బ్రో’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. నటిగానే కాకుండా 'పాప్‌కార్న్' చిత్రంతో నిర్మాతగా కూడా మారారు.
అయితే గత కొంతకాలంగా ఆమె కేరీర్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వ్యాపారవేత్త మిళింద్ చద్వానీని వివాహం చేసుకుంది.
ఈ జంట బ్యాంకాక్‌లో స్థిరపడుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో ఉంటున్నప్పటికీ నటన కొనసాగిస్తాన్నన్నారు.
ఆమె తెలిపినప్పటికీ, తాజాగా అవికా గోర్ షేర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆమె ఫిల్మ్ కేరీర్‌పై సరికొత్త చర్చకు దారితీసింది.
నా ప్రయాణం ఎక్కడ మొదలైందో, మళ్లీ అక్కడికే చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మన జీవితంలో కొత్త మార్గాలను ఎప్పుడూ వేడుకగా జరుపుకుంటాం,
జీవితం అప్పుడప్పుడు మనల్ని పాత మూలల వైపు తిరిగి తీసుకెళ్తుంది. సరికొత్తగా అర్థం చేసుకుంటూ ఎదగడం" అని పేర్కొన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్