AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మందుబాబులపై పోలీసుల ఉక్కుపాదం.. నగరంలో ప్రత్యేక డ్రైవ్‌లు.. దొరికారో..

ట్రాఫిక్ రూల్స్‌ను పెడచెవిన పెడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఉక్కుపాదం మోపుతన్నారు. నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ.. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా శనివారం నిర్వహించిన డ్రైవ్‌లో సుమారు 327 మందిపై కేసులు నమోదు చేశారు.

Hyderabad: మందుబాబులపై పోలీసుల ఉక్కుపాదం.. నగరంలో ప్రత్యేక డ్రైవ్‌లు.. దొరికారో..
Hyderabad Drunk And Drive News
Anand T
|

Updated on: Jul 26, 2026 | 9:34 PM

Share

నగరంలో ట్రాఫిక్ నిబంధనలను పెడచెవిన పెడుతూ, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపై హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు వేగవంతం చేశారు. నిబంధనలు పాటించని వారిని అరికట్టేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 327 మంది పట్టుబడగా, వారిపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ADCP (అడ్మిన్) జి. నరేందర్ వెల్లడించారు. పట్టుబడిన వాహనాల్లో 255 ద్విచక్ర వాహనదారులు,13 ఆటోలు, 55 కార్లు, 04 హెవీ వాహనాలు ఉన్నాయన్నారు.

రక్తంలో ఆల్కహాల్ శాతం ఆధారంగా కేసుల వివరాలు

పట్టుబడిన వారిలో ఆల్కహాల్ మోతాదు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 36 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 200 ఎం జీ/100 ఎంఎల్ మధ్య, -35 మంది 201 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 300 ఎం జీ/100 ఎంఎల్ మధ్య, -22 మంది 301 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 550 ఎం జీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్‌ సేవించి పట్టుబడ్డారని ఆయన తెలిపారు. వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు స్పష్టం చేశారు.

పోలీసుల తీవ్ర హెచ్చరిక!

మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరం. తాగి వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత (BNS) 2023 లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తాం. ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశం ఉంది” అని సైబరాబాద్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
తులం బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
తులం బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?
ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?
జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ నుంచి కొమురవెల్లికి ప్రయాణం
జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ నుంచి కొమురవెల్లికి ప్రయాణం
ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా?
ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా?
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..