AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSCలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తుల ప్రారంభం ఎప్పట్నుంచో తెలుసా?

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. సోషల్‌, ట్రైబల్‌, బీసీ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీసుల్లో 73 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 9 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు జీతం లభిస్తుంది..

APPSCలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తుల ప్రారంభం ఎప్పట్నుంచో తెలుసా?
APPSC Hostel Welfare Officer Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 05, 2026 | 6:48 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC), విజయవాడ నుంచి నిరుద్యోగులకు కీలక అప్‌డేట్ జారీ చేసింది. రాష్ట్రంలోని సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీసుల్లో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 73 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్‌ 9 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ 2026 అక్టోబరు 29. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా అభ్యర్థులు ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

పోస్టుల వివరాలు

ఈ నియామకంలో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-II పోస్టులు మూడు విభాగాల్లో ఉన్నాయి.

  • సోషల్‌ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ పోస్టుల సంఖ్య: 21
  • ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ పోస్టుల సంఖ్య: 23
  • బీసీ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ పోస్టుల సంఖ్య: 29

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ (Bachelor’s Degree) లేదా దానికి సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హతలు కలిగినవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 29, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికను సింగిల్‌ లెవెల్‌ ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష (CBT) ద్వారా చేపడతారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు నెలవారీ వేతనం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ నియామకం మంచి అవకాశంగా చెప్పొచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు APPSC అధికారిక నోటిఫికేషన్‌లో విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, పరీక్ష విధానం తదితర పూర్తి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్ 9, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 29, 2026.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us