AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 తిందాం అనుకున్నవారు 4 తింటారు అంత బాగుంటుంది ఈ స్వీట్ పూరీ.. ఇలా చేసేయండి!

అతిథులు సడెన్‌గా వచ్చినా, లేదా ఇంట్లో తీపి తినాలనే కోరిక కలిగినా, తక్కువ సమయంలో, ఇంట్లో దొరికే సామాన్యమైన పదార్థాలతో ఓ అద్భుతమైన, ఆరోగ్యకరమైన స్వీట్‌ను తయారు చేసుకోవచ్చు. అటువంటిదే ఈ ఇన్స్టంట్ స్వీట్ పూరీ రెసిపీ. ఈ పూరీ, ఒకసారి తింటే నాలుగైనా తినాలనిపించేంత రుచిగా ఉంటుంది..

Srilakshmi C
|

Updated on: Oct 02, 2026 | 6:17 PM

Share
అతిథులు సడెన్‌గా వచ్చినా, లేదా ఇంట్లో తీపి తినాలనే కోరిక కలిగినా, తక్కువ సమయంలో, ఇంట్లో దొరికే సామాన్యమైన పదార్థాలతో ఓ అద్భుతమైన, ఆరోగ్యకరమైన స్వీట్‌ను తయారు చేసుకోవచ్చు. అటువంటిదే ఈ ఇన్స్టంట్ స్వీట్ పూరీ రెసిపీ. ఈ పూరీ, ఒకసారి తింటే నాలుగైనా తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ముఖ్యంగా బెల్లం, గోధుమపిండితో తయారు చేయడం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

1 / 7
కావలసిన పదార్థాలు.. గోధుమపిండి: 1 1/2 కప్పు, ఉప్పు: 1 టీ స్పూన్, పసుపు: చిటికెడు (రంగు కోసం), నూనె: 1 టీ స్పూన్, నీళ్లు: 3/4 కప్పు వరకు (అవసరాన్ని బట్టి), బెల్లం: 1 కప్పు, నీళ్లు: 1/2 కప్పు, తురిమిన బెల్లం: 1/2 కప్పు, పుట్నాలు: 1 కప్పు, యాలకులు: 2, గుమ్మడి గింజలు: గుప్పెడు, జీడిపప్పు: గుప్పెడు (లేదా బాదంపప్పు, పల్లీలు), పూరీలు వేయించడానికి నూనె: సరిపడా చొప్పున తీసుకోవాలి.

2 / 7
ముందుగా వెడల్పాటి ప్లేట్‌లో గోధుమపిండి, ఉప్పు, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పూరీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మెత్తగా కలిపితే పూరీలు నూనె పీల్చుకుంటాయి. పిండిని మూతపెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి, అందులో ఒక కప్పు బెల్లం, అర కప్పు నీళ్లు పోసి హై ఫ్లేమ్‌లో బెల్లం కరిగే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, గులాబ్ జామున్ పాకంలా చేతి వేళ్ళకు జిగురుగా ఉంటే సరిపోతుంది. కరిగిన బెల్లం నీళ్లను వడగట్టి పక్కన పెట్టుకోవాలి. బెల్లంలో చెత్త ఉండవచ్చు కాబట్టి వడగట్టడం ముఖ్యం.

3 / 7
ఒక చిన్న మిక్సీ జార్‌లో అర కప్పు తురిమిన బెల్లం, ఒక కప్పు పుట్నాలు, రెండు యాలకులు, గుప్పెడు గుమ్మడి గింజలు, గుప్పెడు జీడిపప్పు (లేదా మీకు నచ్చిన నట్స్) వేసి మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్ పొడిని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే మూడు నెలల వరకు పాడవకుండా ఉంటుంది. పిండిని ఐదు నిమిషాల తర్వాత తీసి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూరీ సైజు మరీ పెద్దగా లేదా మరీ చిన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. పిండి ఉండను తీసుకుని, కొద్దిగా పొడిపిండి అద్దుకుని మామూలు పూరీల్లా ఒత్తుకోవాలి. పూరీలకు చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోకూడదు.

4 / 7
స్టవ్ మీద నూనె పెట్టి బాగా కాగిన తర్వాత పూరీలను ఒక్కొక్కటిగా వేసి హై ఫ్లేమ్‌లో పొంగనివ్వాలి. తర్వాత రెండో వైపుకు తిప్పి, రెండు సార్లు అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. బాగా వేగిన పూరీలను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా పూరీలను వేయించుకోవాలి.

5 / 7
వేడిగా ఉన్న పూరీని తీసుకుని, అది పొంగి ఉంటే మధ్యలో కొద్దిగా నొక్కి, గోరువెచ్చని బెల్లం పాకంలో అటువైపు, ఇటువైపు ముంచి తీయాలి. ఎక్కువ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. పూరీకి అదనంగా పట్టిన పాకాన్ని తీసేసి, ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న స్టఫింగ్ పొడిని పూరీ పైన మీ ఇష్టానికి తగ్గట్లుగా చల్లుకోవాలి. ఆ తర్వాత పూరీని జాం రోల్ చేసుకున్నట్లుగా టైట్‌గా రోల్ చేసుకోవాలి.

6 / 7
ఇదే విధంగా ప్రతి పూరీని పాకంలో ముంచి, పొడి చల్లుకుని రోల్ చేసుకుంటే కరకరలాడే, నోరూరించే స్వీట్ పూరీలు సిద్ధం. ఈ స్వీట్‌లో షుగర్ బదులు బెల్లం, మైదాకు బదులు గోధుమపిండి, పుట్నాలు, నట్స్ ఉండటం వల్ల ఇది పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఆరోగ్యకరమైన, పౌష్టికమైన స్నాక్. పూరీ పిండిని గట్టిగా కలిపితే నూనె తక్కువ పీల్చుకుంటుంది. బెల్లం పాకం మరీ గట్టిగా కాకుండా జిగురుగా ఉండాలి. స్టఫింగ్‌లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, నట్స్ వాడుకోవచ్చు. పూరీలు వేయించేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి. ఈ స్వీట్ పూరీని ప్రయత్నించి, దాని అద్భుతమైన రుచిని మీరూ ఆస్వాదించండి!

7 / 7
Follow Us
1 తిందాం అనుకున్నవారు 4 తింటారు అంత బాగుంటుంది ఈ స్వీట్ పూరీ..!

గోల్డ్ మెడల్ కోసం దాయాదుల పోరు.. స్టేజ్‌పై నఖ్వీ కనిపిస్తారా లేదా

44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల హాకీలో భారత మహిళల జట్టుకు స్వర్ణం

మదురోను పట్టుకునే ముందు AI గ్రోక్‌ను ప్రశ్నించిన ట్రంప్..

చిన్న విషయంలో గొడవ.. ఫ్రెండ్‌ను ఎంత ఘోరంగా హత్య చేశారో

కంపెనీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయడం లేదా..? ఇలా ఫిర్యాదు చేయండి..

రోహిత్-గిల్‌కు రెస్ట్? చివరి వన్డేలో టీమిండియా ప్రయోగాలు

మరో రెండు రోజుల్లో గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్లే

200 ఏళ్ల చావిడి.. నేటికీ చెక్కుచెదరలేదు
200 ఏళ్ల చావిడి.. నేటికీ చెక్కుచెదరలేదు
కొన్ని విషయాలు మనతోనే ఉండాలి.. సెంచరీపై రోహిత్‌ స్పందన