AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: నాన్న కోసమే ఆ సినిమా చేశా.. ఇండస్ట్రీ వదిలేద్దామనుకున్నా : శ్రుతిహాసన్

విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్. నటనతో పాటు గాయనిగా, సంగీతంపై ఆసక్తి ఉన్న ఆర్టిస్ట్‌గా కూడా తన ప్రతిభను చాటుకుంది. అయితే సినీ ప్రయాణం ప్రారంభమైన సమయంలో మాత్రం ఆమె కెరీర్‌పై ఎన్నో సందేహాలు ఉండేవట.

Rajeev Rayala
|

Updated on: Oct 04, 2026 | 7:57 PM

Share
విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్. నటనతో పాటు గాయనిగా, సంగీతంపై ఆసక్తి ఉన్న ఆర్టిస్ట్‌గా కూడా తన ప్రతిభను చాటుకుంది. అయితే సినీ ప్రయాణం ప్రారంభమైన సమయంలో మాత్రం ఆమె కెరీర్‌పై ఎన్నో సందేహాలు ఉండేవట. ముఖ్యంగా తాను నటించిన ఓ సినిమా విషయంలో శ్రుతి హాసన్‌కు తనపైనే నమ్మకం తగ్గిపోయిందట. శ్రుతి హాసన్‌కు సినిమాలతో పరిచయం చిన్న వయసులోనే ఏర్పడింది.

1 / 5
తన తండ్రి కమల్ హాసన్ నటించిన చిత్రాల్లో బాలనటిగా కనిపించిన ఆమె.. సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, కుటుంబ నేపథ్యం కారణంగా సినీ ప్రపంచాన్ని దగ్గరగా చూసింది. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హే రామ్’ సినిమాలో కూడా శ్రుతి హాసన్ కనిపించింది. ఈ చిత్రంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ కుమార్తె పాత్రలో ఆమె నటించింది. అయితే ఆ పాత్రను చేసే విషయంలో తన తండ్రి కమల్ హాసన్‌దే కీలక పాత్ర అని శ్రుతి గతంలో వెల్లడించింది. ఆ పాత్రలో నటించమని కమల్ హాసన్ తనను ప్రత్యేకంగా కోరారని ఆమె చెప్పింది. 

2 / 5
అయితే పెద్దయ్యాక హీరోయిన్‌గా తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన శ్రుతి హాసన్‌కు తొలి రోజుల్లో ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. 2009లో వచ్చిన హిందీ చిత్రం ‘లక్’తో ఆమె హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా శ్రుతి హాసన్ కెరీర్‌కు ఆశించిన స్థాయిలో బలమైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయింది. అంతేకాదు.. సినిమాలో తన నటనను చూసుకున్న తర్వాత శ్రుతి హాసన్ కూడా సంతృప్తి చెందలేదట. తాను నటించిన విధానం తనకే నచ్చలేదని భావించిన శ్రుతి.. ఇక సినిమాల్లో కొనసాగకపోవడమే మంచిదని ఒక దశలో అనుకుందట. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలని కూడా ఆలోచించినట్లు ఆమె గతంలో వెల్లడించింది.

3 / 5
అయితే అక్కడితో సినీ ప్రయాణాన్ని ముగించకూడదని శ్రుతి నిర్ణయించుకుంది. తనలో ఉన్న నటిని తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకుందట. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ క్రమంగా తన నటనను మెరుగుపరుచుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో శ్రుతి హాసన్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్నమైన పాత్రలను కూడా ఎంచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లింది.

4 / 5
తండ్రి కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడి కుమార్తె కావడంతో సహజంగానే శ్రుతిపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడం అంత సులభం కాదు. తొలి సినిమా అనుభవం తర్వాత ఎదురైన నిరాశను అధిగమించి.. తనను తాను మెరుగుపరుచుకోవడం ద్వారా శ్రుతి హాసన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒక దశలో సినిమాలను వదిలేయాలని అనుకున్న ఆమె.. అదే సినీ రంగంలో కొనసాగుతూ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం విశేషం. అందుకే శ్రుతి హాసన్ కెరీర్‌ను పరిశీలిస్తే లక్ సినిమా ఆమెకు విజయం కంటే ఒక గుణపాఠంగా మారిందని చెప్పొచ్చు.

5 / 5
Follow Us