AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క సిగరెట్‌.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్‌!

ఒకే ఒక్క సిగరెట్‌.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్‌!

Phani CH
|

Updated on: Oct 04, 2026 | 10:26 PM

Share

శ్రీకాకుళం వాంబే కాలనీలో సిగరెట్‌ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. మద్యం మత్తులో సిగరెట్‌ వెలిగించి బొంతపై ఉంచి నిద్రపోవడంతో నిప్పురవ్వలు మంటలకు దారితీసినట్లు సమాచారం. తలుపులు మూసి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటన ధూమపానం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలతో పాటు, సిగరెట్‌ను నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల సంభవించే అగ్ని ప్రమాదాలపై కూడా తీవ్ర హెచ్చరికగా నిలిచింది.

ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. ఇది మనం రోజూ వినే పాఠమే.. అయినా ఎవరూ లెక్కచేయరు..కానీ ఒకే ఒక్క సిగరెట్‌.. ఒక మనిషి నిండు ప్రాణాలు తీసేసింది. ఆ..ఏముంది.. సిగరెట్‌ కాల్చడంవల్ల క్యాన్సర్‌ వచ్చి పోయుంటాడులే అనుకుంటున్నారా.. కానే కాదు. ఎవరూ ఊహించని విధంగా ఒక సిగరెట్ ఆ వ్యక్తిని సజీవం దహనం చేసింది. సిగరెట్‌ కాల్చడం ఎంత హానికరమో.. కాల్చేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండటం కూడా అంతకంటే ప్రమాదమని ఈ ఘటన నిరూపించింది. వివరాల్లోకి వెళ్దాం.. మద్యం, సిగరెట్, పొగాకు వంటి వ్యసనాలు మనిషి ప్రాణాలను, జీవితాలను ఎలా బుగ్గిపాలు చేస్తాయో చెప్పడానికి శ్రీకాకుళంలో జరిగిన ఈ ఘోర ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాకుళం నగరంలోని వాంబే కాలనీలో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో పాలిశెట్టి వెంకటనరసింహమూర్తి అనే వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. తాగి మత్తులో వెలిగించిన సిగరెట్‌ను తాను పడుకున్న బొంతపై ఉంచి నిద్రలోకి జారుకున్నాడు. అదే ఆయన చేసిన పెద్ద పొరపాటు. ఒకప్పుడు దర్జాగా, గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి, చివరికి వ్యసనాల బారిన పడి, ఒంటరితనంతో కృంగిపోయి, యాచన చేసుకుంటూ, చిన్న నిర్లక్ష్యంతో నిద్రలోనే కాలిబూడిదవ్వడం అందరి గుండెలను పిండేస్తోంది. ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు.. సమాజంలో పెరిగిపోతున్న వ్యసనాలు, నిర్లక్ష్యం ఎంతటి ప్రాణనష్టానికి దారితీస్తాయో తెలిజేస్తోంది. అసలేం జరిగింది? వాంబే కాలనీ 3వ బ్లాక్‌లో బుధవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో నుంచి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన పరిసర ప్రాంతాల ప్రజలు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేసేలోపే ఘోరం జరిగిపోయింది. ఇంట్లో ఉన్న పాలిశెట్టి వెంకటనరసింహమూర్తి అలియాస్ రమణ మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామానికి చెందిన వెంకటనరసింహమూర్తి తండ్రి పోలీసు శాఖలో పనిచేసేవారు. దాంతో వీరు తుమ్మావీధిలో నివాసముండేవారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంతో మరణించడం, ఆయనకు వివాహం కాకపోవడంతో క్రమంగా ఒంటరితనం ఆవహించింది. ఈ క్రమంలో మద్యానికి, సిగరెట్లకు బానిసయ్యారు. ఒంటరితనం వల్ల మతిస్థిమితం కూడా కోల్పోయిన ఆయన, ఇల్లు వదిలి వాంబే కాలనీలో యాచకుడిగా జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఉదయం సిగరెట్ వెలిగించి, బొంత పై పెట్టి తాగుతూ నిద్రలోకి జారుకున్నారు. ఆ నిప్పు రవ్వలకు రాజుకుని రాజుకుని బొంతకు మంటలు అంటుకున్నాయి. తలుపులు వేసి ఉండటంతో క్షణాల్లో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఇంట్లోని ద్విచక్ర వాహనంతో పాటు ఆయన కూడా సజీవ దహనమయ్యారు. సిగరెట్ లేదా పొగాకు వాడకం అనేది మనిషి ఆరోగ్యాన్ని లోపలి నుంచి గుల్ల చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది ధూమపానం వల్ల కలిగే వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారు. సిగరెట్ పొగలో వేలాది విషరసాయనాలు ఉంటాయి. వాటివల్ల భయంకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయి. సిగరెట్‌లో ఉండే నికోటిన్ రక్తాన్ని చిక్కగా మార్చుతుంది. రక్తం గడ్డకట్టే ముప్పు పెరుగుతుంది. రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తం సరఫరా సరిగ్గా అందక గుండెపోటు , పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు, నిరంతరం ధూమపానం చేయడం వల్ల శరీరంలో సహజసిద్ధంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి క్రమంగా క్షీణించిపోతుంది. దీంతో ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా శరీరం త్వరగా కోలుకోలేదు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి మద్యానికో, సిగరెట్‌కో బానిసైతే ఆ ఇంట్లో ప్రశాంతత అనేదే ఉండదు. సిగరెట్‌ వల్లో, మద్యం వల్లో ఆ వ్యక్తి అకాల మరణం పాలైతే ఆ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక, మానసిక సమస్యలు వర్ణనాతీతం. కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేదా ఇంటి పెద్ద వ్యసనాల వల్ల అనారోగ్యానికి గురై చనిపోతే, ఆ కుటుంబం ఒక్కసారిగా వీధిపాలవుతుంది. తండ్రి లేకపోవడంతో పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతాయి. వారు చిన్నతనంలోనే పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యసనానికి బానిసైన వ్యక్తి ఆసుపత్రి పాలైనప్పుడు ఆయనను కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు పడే వేదన, చేసే అప్పులు, పడే మానసిక ఆందోళన ఆ ఇంట్లోని ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తాయి. సిగరెట్ వల్ల కేవలం అనారోగ్య సమస్యలే కాదు, దానిని ఉపయోగిస్తున్నప్పుడు చూపించే చిన్నపాటి ఏమరపాటు పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతుంది. మద్యపానం చేసి పరుపులపై, సోఫాలపై కూర్చొని సిగరెట్ తాగుతూ నిద్రపోవడం అత్యంత ప్రమాదకరం. శ్రీకాకుళం ఘటనలో జరిగింది సరిగ్గా ఇదే. వంటగదిలో లేదా గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రాంతాల్లో సిగరెట్ వెలిగిస్తే క్షణాల్లో పెద్ద ఎత్తున పేలుడు సంభవించే అవకాశం ఉంది. అలాగే కాలిన సిగరెట్ పీకలను పూర్తిగా ఆర్పకుండా ఎండిన గడ్డి, చెత్తాచెదారంలో పడేయడం వల్ల పెద్ద ఎత్తున అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. పెట్రోల్ బంకులు, రసాయన పరిశ్రమలు వంటి అత్యంత ప్రమాదకరమైన ఉద్గారాలు ఉండే ప్రాంతాల్లో సిగరెట్ వెలిగించడం వల్ల సంభవించే ప్రమాదాలను ఊహించలేం. మద్యం, సిగరెట్ వంటి అలవాట్ల నుంచి బయటపడటానికి సంకల్ప బలం, కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. ముందుగా ఈ అలవాటును మానాలనే దృఢ సంకల్పం ఆ వ్యక్తిలో కలగాలి. తీవ్రమైన వ్యసనం ఉన్నవారు వైద్యులను సంప్రదించి, డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా వైద్య సహాయం పొందవచ్చు. ఇక కుటుంబ సభ్యుల మద్దతు కూడా వీరికి చాలా అవసరం. వ్యసనపరులను దూషించకుండా, వారికి ఆప్యాయత అందించి ఆ అలవాటు నుంచి బయటపడేలా ప్రోత్సహించాలి. వ్యసనాలకు బదులుగా యోగా, ధ్యానం, వ్యాయామం, మరియు మంచి పుస్తకాలు చదవడం వంటి అలవాట్లను పెంపొందించుకోవాలి. శ్రీకాకుళంలో నరసింహమూర్తి అనుభవించిన దయనీయ పరిస్థితి మనందరికీ ఒక హెచ్చరిక. ఒకప్పుడు దర్జాగా బతికిన ఆయన, చివరికి వ్యసనాల వల్ల ఒంటరిగా మారి, ఒకే ఒక్క సిగరెట్ తెచ్చిన నిర్లక్ష్యంతో నిద్రలోనే కాలిబూడిదయ్యారు. ప్రతి ఒక్కరూ ఈ ఘటన నుంచి పాఠం నేర్చుకోవాలి. వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు, నిత్య జీవితంలో చిన్నపాటి ఏమరపాటుకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండటం అత్యంత ఆవశ్యకం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Putin: అక్కడ గనక దాడి చేస్తే అణు బాంబులేస్తాం.. పుతిన్‌ వార్నింగ్‌

దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్‌ అవుతున్న ప్రత్యేక వంటకం

గుడ్‌ న్యూస్‌.. ఇక పురుషులకూ ఫ్రీ బస్‌ సదుపాయం

ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..

గుడ్‌న్యూస్‌.. హెచ్-1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్

Follow Us