AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Putin: అక్కడ  గనక దాడి చేస్తే అణు బాంబులేస్తాం.. పుతిన్‌ వార్నింగ్‌

Putin: అక్కడ గనక దాడి చేస్తే అణు బాంబులేస్తాం.. పుతిన్‌ వార్నింగ్‌

Phani CH
|

Updated on: Oct 04, 2026 | 10:17 PM

Share

కలినిన్‌గ్రాడ్‌పై నాటో దేశాలు దాడి చేసినా, దిగ్బంధించినా అణ్వాయుధాలతో సహా అందుబాటులో ఉన్న విధ్వంసక ఆయుధాలను ఉపయోగించేందుకు వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించారు. మాస్కోలో వాల్డాయ్‌ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన, రష్యా సార్వభౌమత్వానికి ముప్పు వస్తే తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. అయితే ఐరోపాపై దాడి చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. పుతిన్‌ వ్యాఖ్యలను నాటో చీఫ్‌ మార్క్‌ రుట్టే తప్పుబట్టారు.

రష్యా భూభాగమైన కలినిన్‌గ్రాడ్‌పై గనక ప్రత్యక్షంగా దాడులు జరిగితే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాటో దేశాలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. మాస్కోలో జరిగిన వాల్డాయ్ ఫోరమ్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే అందుబాటులో ఉన్న అన్ని రకాల విధ్వంసక ఆయుధాలను తక్షణమే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. పోలండ్, లిథువేనియా దేశాల మధ్య ఉన్న కలినిన్‌గ్రాడ్ ప్రాంతం రష్యాకు అత్యంత వ్యూహాత్మకమైనది. ఒకవేళ నాటో బలగాలు కలినిన్‌గ్రాడ్‌‌ను దిగ్బంధించినా లేదా దాడులకు దిగినా అణు యుద్ధం అనివార్యమవుతుందని హెచ్చరించారు. ఐరోపా దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని, శాంతియుతంగా కలిసి జీవించడమే తమ ఆకాంక్ష అని చెబుతూనే, రష్యా సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని తెగేసి చెప్పారు. సైనిక బలం పరంగా నాటో తమ కంటే రెండింతలు పెద్దదైనప్పటికీ, ప్రత్యర్థులపై పూర్తి ఆధిక్యం సాధించగల అత్యాధునిక ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని గుర్తుచేశారు. మరోవైపు ఉక్రెయిన్‌లో నల్లసముద్ర ప్రాంతంలో దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని పుతిన్ తెగేసి చెప్పారు. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ దాడి చేయడం వల్ల తమ జీడీపీలో ఒక శాతం నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తున్న ఐరోపా కర్మాగారాలపై వెంటనే దాడులు చేసే ఆలోచన లేదని, సరైన అజెండా ఖరారైతే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లతో త్రైపాక్షిక చర్చలకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పుతిన్ హెచ్చరికలపై స్పందించిన నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే.. ఇలాంటి అణు బెదిరింపులు సరికాదని హితవు పలికారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్‌ అవుతున్న ప్రత్యేక వంటకం

గుడ్‌ న్యూస్‌.. ఇక పురుషులకూ ఫ్రీ బస్‌ సదుపాయం

ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..

గుడ్‌న్యూస్‌.. హెచ్-1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్

గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ వచ్చేసింది.. రోజువారీ, నెలవారీ ధరలివే!

Follow Us