AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంటను కాపాడుకోబోయి.. ప్రాణాలే కోల్పోయారు!

పంటను కాపాడుకోబోయి.. ప్రాణాలే కోల్పోయారు!

Phani CH
|

Updated on: Oct 04, 2026 | 9:43 PM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి పందులు, కోతుల నుంచి కోతకు సిద్ధమైన వరి పంటను కాపాడుకునేందుకు పొలానికి వెళ్లిన గంటా దేవయ్య, లక్ష్మి దంపతులు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందారు. గురువారం పొలానికి వెళ్లిన వారు రాత్రయినా ఇంటికి రాకపోయినా కుటుంబ సభ్యులు గుర్తించలేదు. శుక్రవారం ఉదయం తోటి రైతులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

పంటను అడవి పందులు, కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు పొలానికి వెళ్లిన భార్యాభర్తలు పొలంగట్టుపైనే మృతి చెందిన విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంభీరావుపేటకు చెందిన గంటా దేవయ్య, గంటా లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా, వారికి వివాహాలు కావడంతో ఇంట్లో ఇద్దరే నివసిస్తున్నారు. వీరు కౌలుకు తీసుకున్న పొలంలో వరి పంట ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉంది. అయితే పంటను అడవి పందులు, కోతులు పాడు చేయకుండా కాపాడుకునేందుకు గురువారం వ్యవసాయ పనుల నిమిత్తం దంపతులిద్దరూ పొలానికి వెళ్లారు. పనుల్లో నిమగ్నమైన వారు రాత్రయినా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం రాలేదు. శుక్రవారం ఉదయం పొలం వైపు వెళ్లిన తోటి రైతులు, దేవయ్య-లక్ష్మి దంపతులు చేనులో విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి, దంపతులిద్దరూ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను రక్షించుకోవడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో దంపతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గంభీరావుపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చి వరుడితో ఏదో మాట్లాడింది.. ఉదయం చూసేసరికి వరుడు…

అమ్మబాబోయ్‌.. చిమ్మచీకట్లో గోడపై నక్కిన వింత ఆకారం!

Follow Us