AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్‌.. చిమ్మచీకట్లో గోడపై నక్కిన వింత ఆకారం!

అమ్మబాబోయ్‌.. చిమ్మచీకట్లో గోడపై నక్కిన వింత ఆకారం!

Phani CH
|

Updated on: Oct 04, 2026 | 9:39 PM

Share

హనుమకొండ జిల్లా కోమటిపల్లి తండా నిరూప్‌నగర్‌లో భారీ కొండచిలువ కలకలం రేపింది. తెల్లవారుజామున ఇళ్ల మధ్య ప్రహరీ గోడపై సుమారు 13 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెండు గంటలకు పైగా గోడపైనే ఉన్న పాము అనంతరం నెమ్మదిగా కిందకు దిగి దట్టమైన పొదల్లోకి వెళ్లిపోయింది. కొందరు స్థానికులు ఈ దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించగా, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

హనుమకొండ జిల్లా శివారు ప్రాంతమైన కోమటిపల్లి తండా నిరూప్‌‌నగర్‌లో భారీ కొండచిలువ ప్రత్యక్షమై స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. తెల్లవారుజామున చిమ్మ చీకట్లో ఇళ్ల మధ్య ఉన్న ప్రహరీ గోడపై ఏదో అలికిడి కావడం గమనించిన స్థానికులు, దగ్గరకు వెళ్లి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుమారు 13 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ఆ ప్రహరీ గోడపై నెమ్మదిగా కదులుతూ తిష్ట వేసింది. జనావాసాల మధ్య అంతటి పెద్ద పామును చూసిన పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు. ఆ కొండచిలువ ఎటువైపు నుంచి వచ్చిందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఇటీవలి కాలంలో విషసర్పాల కంటే కూడా కొండచిలువల సంచారం ఎక్కువవుతోందని, కొన్నిచోట్ల మూగజీవులను మింగేస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా ఎన్ని కొండచిలువలు సంచరిస్తున్నాయో, ఎవరి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడతాయో అని ప్రజలు హడలెత్తిపోతున్నారు. ప్రహరీ గోడపై సుమారు రెండు గంటలకు పైగా తిష్టవేసుకొని కూర్చున్న ఆ భారీ కొండచిలువ, చివరకు నెమ్మదిగా కిందకు దిగి పక్కనే ఉన్న దట్టమైన పొదల్లోకి వెళ్ళిపోయింది. దాంతో స్థానికులు, చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గోడపై కొండచిలువ కదులుతున్న దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: బంగాళాఖాతంలో అక్టోబర్ 15 నాటికి మరో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

CM Vijay: ఆర్టీసీ బస్ కండక్టర్‌గా మారి.. టికెట్లు కొట్టిన సీఎం

టాలీవుడ్‌ హీరోతో.. కోలీవుడ్ హీరోయిన్ ఎఫైర్.. ఈ కథ తెలిసి శివమెత్తిన హీరో తల్లి

టికెట్ ఇవ్వలేదని.. ఏకంగా థియేటర్‌నే కొనేశాడు.. ప్రభాస్‌ ఫ్యాన్‌తో పెట్టుకుంటే అంతే మరి!

Fahadh Faasil: చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా.. ఫహాద్‌ ఫన్నీ కామెంట్స్

Follow Us