AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చి వరుడితో ఏదో మాట్లాడింది.. ఉదయం చూసేసరికి వరుడు...

తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చి వరుడితో ఏదో మాట్లాడింది.. ఉదయం చూసేసరికి వరుడు…

Phani CH
|

Updated on: Oct 04, 2026 | 9:41 PM

Share

హైదరాబాద్‌ పాతబస్తీలో పెళ్లికి కొన్ని గంటల ముందు ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాలాపత్తర్‌ పరిధికి చెందిన ఖలీల్‌కు బాలాపూర్‌కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తైన వేళ వరుడు అదృశ్యమయ్యాడు. పక్కింట్లో నివసించే ఇద్దరు పిల్లలున్న వివాహితతో కలిసి అతడు పరారైనట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించగా, కాలాపత్తర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హైదరాబాద్ పాతబస్తీలో పెళ్లికి కొద్ది గంటల ముందు ఊహించని సంఘటన వెలుగుచూసింది. తెల్లవారితే పెళ్లి అనగా, అర్ధరాత్రి వేళ కాబోయే వరుడు పక్కింటి వివాహితతో కలసి పరారైన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఖలీల్‌కు, బాలాపూర్ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇరువైపులా బంధువులు పెళ్లి పత్రికలు పంచడం, ఫంక్షన్ హాల్ బుకింగ్స్, షాపింగ్ వంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో, వివాహానికి ముందు రోజు రాత్రి వరుడు ఖలీల్ ఉన్నట్టుండి మాయమయ్యాడు. పక్కింట్లో నివసించే, ఇద్దరు పిల్లలున్న ఓ మహిళతో కలిసి అతడు పరారైనట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. తీవ్ర ఆందోళనకు గురైన వరుడి కుటుంబ సభ్యులు వెంటనే ఈ విషయాన్ని వధువు కుటుంబానికి తెలియజేశారు. పెళ్లి ఏర్పాట్ల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన వధువు పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. కాబోయే భర్త చేసిన మోసానికి తీవ్ర మనస్తాపానికి గురైన వధువు ఆత్మహత్యకు యత్నించగా, కుటుంబ సభ్యులు సమయానికి అడ్డుకుని పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాలాపత్తర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఖలీల్‌కు సదరు మహిళతో ముందే ప్రేమవ్యవహారం ఉందా? ఇద్దరూ పక్కా ప్లాన్ ప్రకారమే పరారయ్యారా? అనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పక్కింటి ఆంటీతో జంప్ అవ్వడం ప్రస్తుతం పాతబస్తీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మబాబోయ్‌.. చిమ్మచీకట్లో గోడపై నక్కిన వింత ఆకారం!

Follow Us