అలస్కాలోని ఆంకరేజ్ నగరంలో ఆకాశంలో జెల్లీ ఫిష్ ఆకారంలో ఉన్న ఓ వింత వస్తువు కనిపించి సంచలనం సృష్టించింది. ఒక మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌక అని కొందరు అంటుండగా, మరికొందరు భారీ గాలిపటం కావచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారిక నిర్ధారణ ఇంకా రాలేదు.