అబ్బబ్బ.. ఈ రాశుల వారికి శుభవార్తలే.. శుభవార్తలు.. సోమవారం దిన ఫలాలు ఇదిగో
Horoscope Today (October 5, 2026): మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, పెళ్లి ప్రయత్నాలు, ఆరోగ్యం, ప్రయాణాలు తదితర అంశాల్లో ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో పూర్తి వివరాలు చూడండి.

దిన ఫలాలు (అక్టోబర్ 5, 2026): మేషం రాశి ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. వృషభం రాశి వారి కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటుచేసుకుంటుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. మిథునం రాశి వారికి అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):
ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):
కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటుచేసుకుంటుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. అవసరమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో సహచరుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):
అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ లాభాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వింటారు. కొత్త ప్రయత్నాలకు, నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ముఖ్యమైన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశంఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం అవసరం. నిరు ద్యోగులు శుభవార్తలు వింటారు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):
ఉద్యోగంలో అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆదాయ, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి జీవితాలవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):
వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):
వృత్తి, ఉద్యోగాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. డాక్టర్లు, లాయర్లు తమ కార్యకలాపాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో పని భారం ఉంటుంది. స్థిరాస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువుల్లో కొందరి వల్ల ఇబ్బందులుంటాయి. మిత్రుల సహాయంతో ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):
వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయ త్నాలు సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చికాకు పెడతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. తోబుట్టువుల సహకారం లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):
ఉద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి బిజీ జీవితం ఏర్పడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. జీవిత భాగస్వా మితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లుఅందుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):
ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడతారు. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలను వసూలు చేసుకుంటారు. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):
ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. స్తోమతకు మించి బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలపరంగా లబ్ధి చేకూరు తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):
సమస్యల పరిష్కారంలో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఆర్థిక ప్రయత్నాల్లో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు.