AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KS Chitra: ఇప్పటివరకు పాడిన పాటలలో అత్యంత కష్టమైన సాంగ్ అదే.. అసలు అర్థం కాలేదు ఆ పాట.. సింగర్ చిత్ర..

భారతీయ సంగీత ప్రపంచంలో ఎన్నో వందలాది పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసి గాయనిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు కె.ఎస్ చిత్ర. ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా కనిపించే ఆమె.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సంగీత ప్రస్థానం, బాల్యం నుండి నేర్చుకున్న శాస్త్రీయ పునాదులు, సినీ సంగీతంలో ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. ఆమె నిరాడంబరత, ప్రతి సంగీత దర్శకుడి నుండి నేర్చుకునే ఆసక్తి, కొన్ని కష్టమైన పాటల గురించి వివరించారు.

KS Chitra: ఇప్పటివరకు పాడిన పాటలలో అత్యంత కష్టమైన సాంగ్ అదే.. అసలు అర్థం కాలేదు ఆ పాట.. సింగర్ చిత్ర..
Singer Chitra
Rajitha Chanti
|

Updated on: Nov 24, 2026 | 3:57 PM

Share

సింగర్ చిత్ర పాటలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దక్షిణాదిలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న గాయనీమణులలో ఆమె ఒకరు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సంగీత ప్రస్థానం, ఎదుర్కొన్న సవాళ్లు, వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. జానకమ్మ, సుశీలమ్మ వంటి లెజెండరీ గాయనీమణుల పాటలను వింటూ పెరిగిన తాను, వారంత గొప్పగా పాడాలని కోరుకున్నప్పటికీ, తనదైన శైలిలోనే గానం సాగిందని వినయంగా చెప్పారు. పద్మభూషణ్, గౌరవ డాక్టరేట్ వంటి ఉన్నత పురస్కారాలు పొందినప్పటికీ, చిత్ర తన నిరాడంబరతను విడిచిపెట్టలేదు. తనకు బలమైన కర్ణాటక సంగీత పునాదులు ఉన్నప్పటికీ, సినిమా పాటల గానం కోసం ఆ పద్ధతులను పక్కన పెట్టానని చిత్ర వివరించారు. శాస్త్రీయ కచేరీలలో లభించే స్వేచ్ఛ, స్పేస్ సినిమా పాటలలో ఉండవని, చెప్పిన మీటర్‌లో, వాయిస్ వాల్యూమ్‌తో పాడటం నిజంగా సవాలేనని ఆమె అన్నారు. కొన్నిసార్లు ఒక రోజులో వివిధ భావాలతో కూడిన, అరుస్తూ పాడే పాటల నుండి హస్కీ పాటల వరకు ఎదురవుతాయని, అది గాయకులకు పెద్ద సవాలు అని ఆమె అన్నారు.

బాల్యం నుంచే సంగీత సాధనలో చిత్ర కఠినమైన శిక్షణ పొందారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు సంగీత కళాశాలలో, ఆ తర్వాత ఓమనకుట్టి టీచర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఇంటికి వచ్చాక తల్లిదండ్రుల పర్యవేక్షణలో సోదరుడు మృదంగం వాయిస్తుంటే, సోదరితో కలిసి కీర్తనలు అభ్యసించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. “రంజనీ మృదు పంకజలోచనీ” వంటి కీర్తనలను ఆమె ఇష్టంగా పాడేవారు. లైవ్ ప్రదర్శనలు, స్టూడియో రికార్డింగ్‌ల మధ్య వ్యత్యాసాన్ని చిత్ర వివరించారు. లైవ్ ప్రదర్శనలలో తప్పులు జరిగినా, వాయిస్ అదుపు తప్పినా, మొబైల్స్‌లో రికార్డ్ చేసి లైవ్ అని అప్‌లోడ్ చేయడం టెన్షన్‌కు గురిచేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఫిలిం మ్యూజిక్‌లో ఎలారాజా, కీరవాణి వంటి ప్రముఖ సంగీత దర్శకులు తనను మెంటార్ చేశారని చిత్ర పేర్కొన్నారు. ప్రతి చిన్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా తన గురువేనని, వారి సృజనాత్మకతను పాడు చేయకుండా పాడటం తన బాధ్యత అని ఆమె అన్నారు.

పాటలు నేర్చుకోవడంలో ఆమె ప్రత్యేక పద్ధతిని పంచుకున్నారు. హిందీ పాటలు మినహా మిగతా అన్ని భాషల పాటలను తెలుగు స్క్రిప్ట్ చదివినా, మలయాళంలో రాసుకుని సాధన చేస్తానని తెలిపారు. ఇది ఉచ్చారణలో సహాయపడుతుందని ఆమె వివరించారు. కొన్నిసార్లు రికార్డింగ్‌లకు వెళ్లేటప్పుడు టెన్షన్ ఉంటుందని, ముఖ్యంగా ఇళయరాజా, శరత్ వంటి సంగీత దర్శకుల వద్ద ఎలాంటి పాట వస్తుందోనని భయం ఉంటుందని ఆమె అన్నారు. శరత్ సంగీత దర్శకత్వంలో “సింధూర రేఖ” చిత్రంలోని “ప్రణతోస్మి గురువాయుపురేశం” పాటను పాడినప్పుడు, బేసిక్ సాయి కూడా అర్థం కానంత కష్టంగా అనిపించిందని, అది తన గాత్రంలో అత్యంత కష్టమైన పాట అని చిత్ర వెల్లడించారు. ప్రముఖ రచయిత వైరిముత్తు ప్రోత్సాహంతో సుశీల గారి పాటలను నేర్చుకుని పాడటం తన సంగీత ప్రయాణంలో ఒక మంచి అనుభవమని చిత్ర వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..

Follow Us