AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గణాధిప సంకష్టి చతుర్థి ఎప్పుడు? చంద్రోదయం, ఉపవాస నియమాలు.. ఏం తినాలి? ఏం తినకూడదు?

Ganadhipa Sankashti Chaturthi 2026: 2026లో గణాధిప సంకష్టి చతుర్థి నవంబర్ 27న జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున గణేశుడిని ఎలా పూజించాలి? ఉపవాస సమయంలో ఏం తినాలి? ఏ ఆహార దార్థాలకు దూరంగా ఉండాలి? చంద్రుడికి అర్ఘ్యం ఎప్పుడు, ఎలా సమర్పించాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

గణాధిప సంకష్టి చతుర్థి ఎప్పుడు? చంద్రోదయం, ఉపవాస నియమాలు.. ఏం తినాలి? ఏం తినకూడదు?
Ganadhipa Sankashti Chaturthi 2026
Rajashekher G
|

Updated on: Nov 24, 2026 | 3:40 PM

Share

Ganadhipa Sankashti Chaturthi 2026: హిందూ మతంలో సంకష్టి చతుర్థికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి నెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి తిథి రోజున ఈ వ్రతాన్ని వినాయకుడికి అంకితం చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున గణేశుడి గణాధిప రూపాన్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సంకష్టి అంటే కష్టాలను తొలగించేవాడు అని అర్థం. అందుకే ఈ వ్రతాన్ని ఆచరిస్తే జీవితంలోని ఆటంకాలు తొలగిపోయి, కుటుంబంలో సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ రోజున ఉపవాసం ఉండి గణపతిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.

గణాధిప సంకష్టి చతుర్థి 2026 తేదీ, తిథి సమయాలు

2026లో గణాధిప సంకష్టి చతుర్థి వ్రతాన్ని నవంబర్ 27, శుక్రవారం నాడు ఆచరిస్తారు. పంచాంగం ప్రకారం చతుర్థి తిథి నవంబర్ 27వ తేదీ ఉదయం 9:48 గంటలకు ప్రారంభమై, నవంబర్ 28వ తేదీ ఉదయం 6:39 గంటలకు ముగుస్తుంది. సంకష్టి చతుర్థి వ్రతంలో చంద్రోదయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. చంద్రుడిని దర్శించుకున్న తర్వాతే భక్తులు ఉపవాసాన్ని విరమిస్తారు.

గణాధిప సంకష్టి చతుర్థి నాడు ఎవరిని పూజించాలి?

ఈ రోజున గణేశుడి గణాధిపతి రూపాన్ని పూజిస్తారు. గణాధిపతి అంటే గణాలకు అధిపతి అని అర్థం. సమస్త గణాలకు నాయకుడైన వినాయకుడిని ఏ శుభకార్యమైనా ప్రారంభించే ముందు పూజించడం సంప్రదాయం. ఈ రోజున గణపతికి పూలు, పండ్లు, మోదకాలు, లడ్డూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గణేశుడిని ఆరాధించడం వల్ల విఘ్నాలు తొలగి, జ్ఞానం, వివేకం, విజయం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.

ఉపవాస సమయంలో ఏం తినవచ్చు?

సంకష్టి చతుర్థి రోజున భక్తులు తమ ఆరోగ్యం, విశ్వాసం, సామర్థ్యాన్ని బట్టి నిర్జల ఉపవాసం, జల ఉపవాసం లేదా ఫలాహారం పాటిస్తారు. ఫలాహారం తీసుకునేవారు అరటిపండ్లు, యాపిల్స్, దానిమ్మ, నారింజ, బొప్పాయి వంటి తాజా పండ్లను తినవచ్చు. అలాగే సగ్గుబియ్యంతో తయారుచేసిన ఖిచ్డీ, ఖీర్, వడలను కూడా ఉపవాస ఆహారంగా తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో బంగాళాదుంపలు, చిలగడదుంపలు, పాలు, పెరుగు వంటి వాటిని కూడా తీసుకుంటారు.

ఉపవాస సమయంలో ఏం తినకూడదు?

  • ధాన్యాలు: బియ్యం, గోధుమలు, రవ్వ, సాధారణ పిండితో చేసిన పదార్థాలకు దూరంగా ఉంటారు.
  • ఉల్లిపాయ, వెల్లుల్లి: ఉపవాస సమయంలో వీటిని తామసిక ఆహారంగా భావించి తీసుకోరు.
  • మాంసాహారం: మాంసం, చేపలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలను నివారిస్తారు.
  • సాధారణ ఉప్పు: సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణం (రాతి ఉప్పు) ఉపయోగిస్తారు.
  • మద్యపానం: మద్యం, పొగాకు, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారు.

చంద్రుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి?

సంకష్టి చతుర్థి రోజున చంద్రోదయం తర్వాత చంద్రుడిని దర్శించుకోవాలి. అనంతరం నీటితో నిండిన పాత్రను తీసుకుని చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. చంద్రుడిని స్మరించుకున్న తర్వాత గణేశుడికి పూజ చేసి, మోదకాలు లేదా లడ్డూలను నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. అనంతరం భక్తులు ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ విధంగా నియమనిష్ఠలతో వ్రతాన్ని ఆచరిస్తే గణపతి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న వివరాలు మత విశ్వాసాలు, సంప్రదాయాలు, పంచాంగ సమాచారం ఆధారంగా అందించబడ్డాయి. ప్రాంతాలను బట్టి పూజా విధానాలు, ఉపవాస నియమాల్లో మార్పులు ఉండవచ్చు. ఆచరించే ముందు స్థానిక పంచాంగం లేదా పండితులను సంప్రదించండి.)

మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us