AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyansh Arya: 68 బంతుల్లో 181 పరుగులు.. ప్రియాంశ్ ఆర్య విధ్వంసం.. ఒకే ఇన్నింగ్స్‌లో 5 రికార్డులు

Priyansh Arya: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ కెప్టెన్ ప్రియాంశ్ ఆర్య చరిత్ర సృష్టించాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో 68 బంతుల్లో 181 పరుగులు చేసి భారత టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 19 సిక్సర్లతో ఫిన్ అలెన్ రికార్డును సమం చేశాడు. కేఎల్ రాహుల్ రికార్డును అధిగమించడంతో పాటు కెప్టెన్‌గా మరో ఘనత సాధించాడు.

Priyansh Arya: 68 బంతుల్లో 181 పరుగులు.. ప్రియాంశ్ ఆర్య విధ్వంసం.. ఒకే ఇన్నింగ్స్‌లో 5 రికార్డులు
Priyansh Arya (1)
Rakesh
|

Updated on: Nov 24, 2026 | 3:00 PM

Share

Priyansh Arya: టీ20 క్రికెట్‌లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగితే స్కోరు బోర్డు పరుగులు పెట్టాల్సిందే. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ కెప్టెన్ ప్రియాంశ్ ఆర్య అలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 68 బంతుల్లోనే 181 పరుగులు చేశాడు. ఇందులో 19 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. అతడి దూకుడుతో ఢిల్లీ జట్టు భారీ స్కోరు సాధించడంతో పాటు టీ20 క్రికెట్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.

భారత టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్ ఆర్య 181 పరుగులు చేయడంతో భారత పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. 2026 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన రాహుల్ 67 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును ప్రియాంశ్ అధిగమించాడు. అంతేకాదు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనూ అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. గతంలో తిలక్ వర్మ చేసిన 151 పరుగులే ఈ టోర్నీలో అత్యధిక స్కోరుగా ఉండేది.

ప్రపంచ రికార్డుకు ఏడు పరుగుల దూరంలో..

ప్రియాంశ్ ఆర్య 181 పరుగులతో పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు లువాన్-డ్రే ప్రిటోరియస్ 188 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. దీంతో ప్రపంచ రికార్డును అందుకోవడానికి ప్రియాంశ్ మరో ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయినప్పటికీ భారత ఆటగాళ్లలో ఇంతకుముందెవరూ సాధించని స్థాయిలో పరుగులు చేసి తన సత్తా చాటాడు.

ఎక్కువమంది చదివినది: IND vs PAK: తిలక్ కాదు.. టీమిండియా ఓటమికి ఈ ముగ్గురు అసలైన విలన్లు..!

19 సిక్సర్లు.. ఫిన్ అలెన్ రికార్డుకు సమం

ఈ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మొత్తం 19 సిక్సర్లు బాదాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు కూడా ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 266కు పైగా నమోదైంది. అంటే ప్రతి బంతికి సగటున రెండున్నర పరుగులకు పైగా సాధించాడు.

36 బంతుల్లోనే సెంచరీ.. పవర్‌ప్లేలోనే 94 పరుగులు

ప్రియాంశ్ ఆర్య ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ స్కోరు వికెట్ నష్టానికి 94 పరుగులకు చేరింది. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించిన అతడు కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 150 పరుగుల మార్కును అందుకోవడానికి మరో 24 బంతులు తీసుకున్నాడు. టీ20ల్లో అతడి మూడో సెంచరీ ఇదే. ఈ మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్ వేగం ఢిల్లీకి భారీ స్కోరు అందించింది.

కెప్టెన్‌గా అత్యధిక టీ20 వ్యక్తిగత స్కోరు

కెప్టెన్‌గా కూడా ప్రియాంశ్ ఆర్య అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 2018లో జింబాబ్వేపై 172 పరుగులు చేశాడు. ఇప్పుడు తమిళనాడుపై 181 పరుగులు చేసిన ప్రియాంశ్ ఆ రికార్డును అధిగమించాడు. అతడి ఇన్నింగ్స్‌తో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 275 పరుగులు చేసింది. అనంతరం తమిళనాడు 18.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఢిల్లీ భారీ విజయాన్ని అందుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రియాంశ్ ఆర్య విధ్వంసం.. ఒకే ఇన్నింగ్స్‌లో 5 రికార్డులు
ప్రియాంశ్ ఆర్య విధ్వంసం.. ఒకే ఇన్నింగ్స్‌లో 5 రికార్డులు
పూజలు చేస్తే డబ్బులు డబుల్ అవుతాయన్నారు.. 10 రోజుల తర్వాత..
పూజలు చేస్తే డబ్బులు డబుల్ అవుతాయన్నారు.. 10 రోజుల తర్వాత..
పాము విషానికి ప్రతీక.. మరి వైద్యానికి చిహ్నంగా ఎలా మారింది?
పాము విషానికి ప్రతీక.. మరి వైద్యానికి చిహ్నంగా ఎలా మారింది?
సెంచరీతో టీమిండియా బౌలర్ల తాట తీసిన యూఏఈ బ్యాటర్
సెంచరీతో టీమిండియా బౌలర్ల తాట తీసిన యూఏఈ బ్యాటర్
హీరోయిన్‌కు కథ చెప్తూ చనిపోయిన టాలీవుడ్ దర్శకుడు..
హీరోయిన్‌కు కథ చెప్తూ చనిపోయిన టాలీవుడ్ దర్శకుడు..
ఉయ్యాల ఊగితే ఇన్ని లాభాలా.. పెద్దలు కూడా తప్పక ప్రయత్నించాల్సిందే
ఉయ్యాల ఊగితే ఇన్ని లాభాలా.. పెద్దలు కూడా తప్పక ప్రయత్నించాల్సిందే
చలికాలంలో బద్దకంలేకుండా చురుగ్గా ఉండాలా.. ఇంట్లోనే ఇలా చేయండి
చలికాలంలో బద్దకంలేకుండా చురుగ్గా ఉండాలా.. ఇంట్లోనే ఇలా చేయండి
రక్తంతో లేఖలు.. హీరోయిన్ బికినీతో ఇంటికే వచ్చిన వ్యక్తి..
రక్తంతో లేఖలు.. హీరోయిన్ బికినీతో ఇంటికే వచ్చిన వ్యక్తి..
జియో న్యూ ఇయర్ బొనాంజా.. రూ.399కే అన్‌లిమిటెడ్ డేటా, ఫ్రీ OTTలు !
జియో న్యూ ఇయర్ బొనాంజా.. రూ.399కే అన్‌లిమిటెడ్ డేటా, ఫ్రీ OTTలు !
ఏపీకి వర్ష సూచన.. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి
ఏపీకి వర్ష సూచన.. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి