AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జియో న్యూ ఇయర్ బొనాంజా.. రూ.399కే అన్‌లిమిటెడ్ డేటా, ఫ్రీ OTTలు !!

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో క్రేజీ అనౌన్స్ మెంట్ చేసింది. తమ వినియోగదారులకు కొత్త ఆఫర్లను ప్రకటించింది. టెలికాం రంగంలో తమ పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో.. Happy New Year 2027 పేరుతో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది.

జియో న్యూ ఇయర్ బొనాంజా.. రూ.399కే అన్‌లిమిటెడ్ డేటా, ఫ్రీ OTTలు !!
Reliance Jio
Korivi Jayakumar
|

Updated on: Nov 24, 2026 | 2:37 PM

Share

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో క్రేజీ అనౌన్స్ మెంట్ చేసింది. తమ వినియోగదారులకు కొత్త ఆఫర్లను ప్రకటించింది. టెలికాం రంగంలో తమ పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో.. Happy New Year 2027 పేరుతో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

కాగా ఇందులో భాగంగా కేవలం రూ.399తో ప్రారంభమయ్యే ప్రీపెయిడ్ ప్లాన్‌తో పాటు.. ఏడాది వ్యాలిడిటీ కలిగిన రూ.3,999 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ 4G,5G డేటా, వాయిస్ కాల్స్.. SMSలతో పాటు పలు ఓటీటీల ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. అంతేకాకుండా తక్కువ ధరలో 5G డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు, రాత్రివేళ ప్రత్యేక డేటా ప్యాక్‌ను కూడా జియో తీసుకురావడం గమనార్హం.

రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్..

వ్యాలిడిటీ: 28 రోజులు.

డేటా: అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా.

కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్.

SMS: రోజుకు 100 SMSలు.

అదనపు ప్రయోజనాలు: 12 నెలల Canva Pro, JioHotstar మొబైల్, FanCode, JioGames సేవలు.

క్లౌడ్ స్టోరేజ్: 50GB JioAICloud స్టోరేజ్.

రూ.3,999 వార్షిక రీఛార్జ్ ప్లాన్..

ఏడాది మొత్తం ఒకే రీఛార్జ్‌తో సేవలు పొందాలనుకునే వారి కోసం జియో రూ.3,999 ప్లాన్‌ను తీసుకొచ్చింది.

వ్యాలిడిటీ: 365 రోజులు.

డేటా: అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా.

కాల్స్: అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్.

SMS: రోజుకు 100 SMSలు.

అదనపు ప్రయోజనాలు: 12 నెలల Canva Pro Lite, JioHotstar మొబైల్, FanCode.

క్లౌడ్ స్టోరేజ్: 50GB JioAICloud స్టోరేజ్.

అన్‌లిమిటెడ్ 5G డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు..

ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం జియో రెండు ప్రత్యేక యాడ్-ఆన్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది.

రూ.15 ప్యాక్: ఒక రోజు వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ 5G డేటా.

రూ.25 ప్యాక్: రెండు రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ 5G డేటా.

రూ.50తో నైట్ డేటా ప్యాక్..

రాత్రివేళ ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగించే వారి కోసం రూ.50 ధరతో ప్రత్యేక నైట్ డేటా ప్యాక్‌ను జియో అందిస్తోంది.

ధర: రూ.50.

వ్యాలిడిటీ: 28 రోజులు.

డేటా ప్రయోజనం: ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా.

జియో ప్రకటించిన ఈ కొత్త ఆఫర్లలో నవంబర్ 24 నుంచి రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్, రూ.3,999 వార్షిక ప్లాన్, రూ.25 డేటా యాడ్-ఆన్ అందుబాటులోకి రానున్నాయి. అలానే నవంబర్ 26 నుంచి రూ.50 నైట్ డేటా ప్యాక్ చేసుకోవచ్చు. MyJio యాప్, Jio.com వెబ్‌సైట్, జియో స్టోర్లు, రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవచ్చు.

Follow Us