AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఇదెక్కిడి పిచ్చి రా సామీ.. హీరోయిన్ బికినీ వేలం.. కొన్న వ్యక్తి చేసిన పనికి అంతా షాక్..

సాధారణంగా అభిమానం హద్దు మీరడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. సినిమా ఈవెంట్స్, పబ్లిక్ వేడుకలలో తమ అభిమాన తారల పట్ల కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం నిజానికి వేధింపులకు గురైంది. ఆమె ఓ సినిమాలో నటించిన బికినీని వేలం వేయగా ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ షాకయ్యారు.

Actress : ఇదెక్కిడి పిచ్చి రా సామీ.. హీరోయిన్ బికినీ వేలం.. కొన్న వ్యక్తి చేసిన పనికి అంతా షాక్..
Pooja Bedi
Rajitha Chanti
|

Updated on: Nov 24, 2026 | 2:39 PM

Share

బాలీవుడ్ సినీ చరిత్రలో బోల్డ్ లుక్స్, ప్రత్యేకమైన స్టైల్‌తో గుర్తింపు పొందిన నటీమణులలో పూజా బేడీ ఒకరు. ఒకప్పుడు సినీ తారలకు అభిమానుల నుంచి విపరీతమైన ప్రేమ, లేఖలు వచ్చే కాలం ఉండేది. అయితే తన కెరీర్‌లో జరిగిన ఒక షాకింగ్, ఆసక్తికరమైన ఘటన గురించి పూజా బేడీ గతంలో ఓ షోలో పంచుకున్నారు. 1993లో వచ్చిన ‘లుటేరే’ సినిమాలో తాను ధరించిన బికినీ వేలంలో అమ్ముడుపోవడం, ఆ తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పుకొచ్చారు. 1993 మే నెలలో ముంబైలోని క్రాస్‌వర్డ్‌లో ‘ఫరెవర్ యువర్స్’ పేరుతో ఒక ప్రత్యేక వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు. సెలబ్రిటీలు ఉపయోగించిన దుస్తులు, ఇతర వస్తువులను ఈ వేలంలో ఉంచారు. ఈ కార్యక్రమానికి అర్చన పూరన్ సింగ్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ వేలంలో ‘లుటేరే’ చిత్రంలో పూజా బేడీ ధరించిన బికినీని ఒక వ్యక్తి 1500 రూపాయలకు వేలం పాడి కొనుగోలు చేశారు. అయితే ఆ వ్యక్తి పిచ్చి ప్రేమ, వింత ప్రవర్తన అక్కడితో ఆగలేదని పూజా బేడీ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

ఆ వ్యక్తి తనను చాలా కాలం పాటు వేధించాడని, పూజాకు ఇష్టమైన ‘అనైస్-అనైస్’ పర్ఫ్యూమ్ పేరునే తన పేరుగా మార్చుకున్నాడని పూజా బేడీ వివరించారు. తరచూ ఫోన్ చేయడమే కాకుండా, రక్తంతో రాసిన లేఖలు కూడా పంపేవాడని చెప్పారు. ఒకరోజు ఏకంగా వేలంలో కొనుగోలు చేసిన బికినీని తీసుకుని తన ఇంటికే వచ్చాడని గుర్తుచేసుకున్నారు. తాను అతన్ని కూర్చోబెట్టి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా, అతని ప్రవర్తన వల్ల కొంత ఇబ్బంది పడ్డానని తెలిపారు. తన పెళ్లి అయ్యే వరకు ఇలాంటి సంఘటనలు కొనసాగాయని పూజా బేడీ ఆసక్తికరంగా పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

90వ దశకంలో తన బోల్డ్ స్టైల్, నిక్కచ్చితనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూజా బేడీ. ‘విష్ కన్యా’, ‘జో జీతా వహీ సికందర్’, ‘లుటేరే’, ‘ఆతంక్ హి ఆతంక్’ వంటి హిందీ చిత్రాలతో పాటు పలు దక్షిణాది సినిమాల్లోనూ నటించారు. బిగ్ బాస్’ సీజన్ 5, ‘ఝలక్ దిఖ్లా జా’, ‘ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ’, ‘నాచ్ బలియే’ వంటి షోలలో సందడి చేశారు. కెరీర్ ఆరంభం నుంచే బోల్డ్ ఫోటోషూట్లు, ప్రకటనలు, ఇంటర్వ్యూలలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే నటిగా పేరు తెచ్చుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

పూజా బేడీ..

Pooja Bedi Movies

Pooja Bedi Movies

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..

Follow Us